1. ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష
ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాళేశ్వరం ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2. 'కొట్టొద్దని ఎస్సై షూ పట్టుకున్నా వదల్లేదు.. నన్ను చంపేస్తారేమో'
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసులు ఓ ఎస్సీ యువకుడిని అరెస్టు చేసి... శిరోముండనం చేయించిన ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. సీతానగరం సమీపంలో ఇసుక లారీలు అడ్డగోలుగా తిరుగుతున్నాయని.. దానిని ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని బాధితుడు వరప్రసాద్ వాపోయాడు. పోలీసుల తీరుపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3. గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్ఐఆర్
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపినట్లు.. కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించేందుకు అవకాశముందని సీఎస్ఐఆర్ వెల్లడించింది. అందువల్ల బహిరంగ ప్రదేశాలతో పాటు మూసి ఉన్న ప్రాంతాల్లోనూ మాస్కులు ధరించాలని, కరోనా నివారణ నిబంధనలు పాటించాలని సూచించింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4.యాంటీబాడీ పరీక్ష మేలేనా? కాదా..?
కరోనా వైరస్ యాంటీబాడీలుంటే మళ్లీ ఇన్ఫెక్షన్ రాదని, అందుకే యాంటీబాడీ పరీక్ష చేయించుకోవటం మంచిదని కొందరు భావిస్తుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. అందరికీ ఉపయోగపడేదీ కాదు. యాంటిబాడీ పరీక్షతో మేలేనా తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5. బాలికను ఎత్తుకెళ్లి, 100 సార్లు అత్యాచారం చేసి..
హరియాణాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలికను గ్రామస్థులే ఎత్తుకెళ్లారు. కామం కట్టలు తెంచుకున్న మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మోజు తీరిపోయాక వ్యభిచార గృహానికి వెళ్లి అమ్మాయిని బేరం పెట్టారు. అమ్ముకుని సొమ్ము చేసకున్నారు. దాదాపు ఆరు నెలలుగా వంద మంది మృగాళ్ల చేతిలో నలిగిపోయిన ఆ బాలిక.. ఎట్టకేలకు ఆ నరక యాతన నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.