ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో... దీనిపై మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కొత్త సచివాలయ నిర్మాణానికి ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. సచివాలయం తరలింపు నేపథ్యంలో ప్రస్తుత భవనాలను కూల్చివేసి, కొత్తదాని నిర్మాణానికి డిజైన్ల ఖరారు, పనులు చేపట్టేందుకు అనుమతించడంతో పాటు, ఖరీఫ్ ఉత్పత్తులు, ధాన్యం సేకరణ, రబీ సన్నాహాలపైనా చర్చించనున్నారు.
ప్రగతిభవన్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం ... - cm kcr news
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా... అవినీతి, అలసత్వానికి తావు లేకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఇటీవల శాసనసభ వేదికగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేశారు. కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గింపు సహా ఉద్యోగుల వయోపరిమితి పెంపు విషయమై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..!