తెలంగాణ

telangana

ETV Bharat / city

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి.. రాష్ట్రంలో వర్షాలు! - నేడు రేపు రాష్ట్రంలో వర్షాలు

నేడు, రేపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు తెలిపింది.

today and tomorrow chance to rain fall in telangana
కొనసాగుతున్న ఉపరితల ద్రోణి.. రాష్ట్రంలో వర్షాలు!

By

Published : Apr 17, 2020, 5:03 PM IST

రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ కోస్తా తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ మరియు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది.

ఇవాళ, రేపు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్​నగర్, వికారాబాద్, పెద్దపల్లి జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇదీ చూడండి:రోగికి సాయం కోసం బైక్​పై 430కి.మీ ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details