తెలంగాణ

telangana

ETV Bharat / city

Top Ten News : టాప్ న్యూస్ @ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News , telangana news
టాప్ న్యూస్

By

Published : Mar 1, 2022, 1:00 PM IST

  • 'భారతీయులు తక్షణమే కీవ్​ నగరాన్ని విడిచి వెళ్లండి'

ఉక్రెయిన్​ రాజధాని కీవ్​లో ఉన్న భారతీయులు తక్షణమే ఆ నగరాన్ని విడిచి వెళ్లాలంటూ అక్కడి భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది.

  • 'కీవ్'​ లక్ష్యంగా రష్యా దూకుడు..

గతకొద్ది రోజులుగా ఉక్రెయిన్​పై దాడులు చేస్తున్న రష్యా బలగాలు.. ఆ దేశ రాజధాని కీవ్​ నగరమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. కీవ్​-ఖార్​కివ్​ మధ్య ఉన్న ఒఖ్​తిర్కా మిలిటరీ బేస్​పై రష్యా​ జరిపిన దాడిలో 70 మంది ఉక్రెయిన్​ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరోవైపు రష్యన్ల దాడిలో ఇప్పటివరకు 350 మంది ఉక్రెయిన్​ పౌరులు మృతిచెందినట్లు ఆ దేశం వెల్లడించింది.

  • సత్య నాదెళ్ల కుమారుడు మృతి

మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) మృతి చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అతను కన్నుమూశాడు. పుట్టుకతోనే జైన్​ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో(సెరెబ్రల్​ పాల్జీ) బాధపడుతున్నాడు.

  • కాల్పుల్లో ఇద్దరు రియల్టర్ల మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో.. స్కార్పియో వాహనంపై ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. వాహనంలో ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు ఉండగా.. వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారంలో వివాదాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది.

  • మహానగరంలో జూదగాళ్లు.. ఎమ్మెల్యే సహా ప్రముఖులు ..

తెలంగాణ ప్రభుత్వం పేకాటపై నిషేధం విధించినా పేకాటరాయుళ్లు మాత్రం తగ్గేదేలేే అంటున్నారు. తాజాగా హైదరాబాద్​ మాదాపూర్‌లోని కాకతీయహిల్స్‌లో గుట్టుగా జరుగుతున్న పేకాట శిబిరంపై మాదాపూర్‌ డీసీపీ కె.శిల్పవల్లి నేతృత్వంలో సోమవారం రాత్రి దాడులు చేశారు.

  • పండుగ పూట విషాదం..

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొంది. మహాశివరాత్రి సందర్భంగా పుణ్య స్నానానికి వెళ్లి ప్రాణహిత నదిలో ఇద్దరు గల్లంతయ్యారు.

  • 'ఏప్రిల్‌ 1 నుంచి కొత్త విద్యుత్‌ ఛార్జీలు..!'

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఈఆర్సీ ఏం నిర్ణయం తీసుకోబోతోంది? ప్రభుత్వం బకాయిల వల్లే డిస్కంలు నష్టాల్లో ఉన్నాయా? డెవలప్‌మెంట్‌ ఛార్జీల పేరిట వసూళ్లు ఎందుకు చేస్తున్నారు? రైతులు 24 గంటల ఉచిత విద్యుత్‌ వద్దంటున్నారా? ఏప్రిల్‌ 1 నుంచి కొత్త టారిఫ్‌లు అమలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావుతో స్పెషల్ ఇంటర్వ్యూ..

  • అత్యంత కనిష్ఠానికి జననాల రేటు

చైనాలో వివాహాల నమోదు గణనీయంగా పడిపోయింది. పెళ్లి చేసుకున్న జంటల వయసూ అధికంగా ఉంటోంది. ఫలితంగా 2021లో ఆ దేశంలో జననాల రేటు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మహిళల హక్కులకు వ్యతిరేకంగా చట్టాలు అమలుచేస్తున్నా.. జనాభా పెరుగుదలకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు!

  • నెటిజన్లపై షమి ఫైర్​!

తనపై వస్తోన్న విమర్శలను అస్సలు పట్టించుకోనని అన్నాడు టీమ్​ఇండియా పేసర్​ మహ్మద్​ షమి. తనను విమర్శించిన వారు అసలు అభిమానులే కాదని, వాళ్లు నిజమైన భారతీయులు కూడా కాదని అన్నాడు.

  • 'కచ్చా బాదమ్'​ సింగర్​కు రోడ్డు ప్రమాదం!

'కచ్చాబాదమ్'​ సాంగ్​తో ఓవర్​నైట్​ స్టార్​గా మారిన భుబన్​ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details