ఉద్యోగుల అందరి పక్షాన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు టీఎన్జీవో కేంద్ర సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగులకు మెరుగైన ఫిట్మెంట్, పదవీ విరమణ వయసు పెంచడం, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ప్రకటించటంతో పాటు ఉద్యోగుల సమస్యలన్నింటినీ ప్రేమతో పరిష్కరించడంలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. హరీశ్‌రావును టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
'మంత్రి హరీశ్‌రావుకు టీఎన్జీవో కేంద్ర సంఘం కృతజ్ఞతలు' - టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు కలిశారు. ఉద్యోగులకు మెరుగైన ఫిట్మెంట్, పదవీ విరమణ వయసు పెంచడం, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ప్రకటించటంతో పాటు ఉద్యోగుల సమస్యలన్నింటినీ ప్రేమతో పరిష్కరించడంలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
tngo leaders meet minister harish rao
ఈ ప్రక్రియలో ప్రత్యేక చొరవ చూపినందుకు.... రాష్ట్ర ఉద్యోగులందరి పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను సాధించడంలో మెరుగైన పనితనాన్ని చూపిస్తూ... రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అగ్రభాగాన ఉంటామని ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు.