ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద (Kodandaram on Trs Dharna) తెరాస నిరసన తెలపడంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇందిరా పార్కు వద్ద ధర్నా చేయవద్దన్నారని కోదండరాం చెప్పారు. ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ఏడాది పాటు పోరాటం చేసి న్యాయస్థానం ద్వారా తిరిగి అక్కడే ధర్నా (Kodandaram on Dharna chowk) చేసేందుకు అనుమతి తెచ్చుకున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఆందోళనలు, ధర్నాలు అందరూ చేయవచ్చని అన్నారు. తెరాసకు ధర్నా చేసేందుకు (Kodandaram on Trs Dharna) ఎంత హక్కు ఉందో ప్రజా సంఘాలకు, ప్రతిపక్షాలకు కూడా అంతే హక్కు ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు గుర్తించుకోవాలని కోదండరాం సూచించారు.
'ఇవాళ తెరాస నేతలు ధర్నాచౌక్ వద్ద నిరసన తెలిపారు. అనేక ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు కృషిఫలితంగానే ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్ ఉంది. నాడు ఇందిరాపార్కు వద్దనుంచి ధర్నాచౌక్ ఎత్తివేస్తాం.. ఇంకెక్కడైనా ధర్నాచౌక్ పెట్టుకోమన్నారు. ఏడాదిపాటు పోరాడి కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్నాం.'