YV Subbareddy statements on ttd assets: ఏపీలోని శ్రీవారి ఆస్తుల వివరాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా తితిదేకు 960 ఆస్తులున్నట్లు ఆయన తెలిపారు. వీటి విలువ సుమారు రూ.85,705 కోట్లు అని పేర్కొన్నారు. ఇందులో దేశవ్యాప్తంగా సుమారు 7వేల ఎకరాల భూమితో పాటు, రూ.14వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 14 టన్నుల బంగారం ఉందని ఛైర్మన్ చెప్పారు.
TTD Assets: శ్రీవారి ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా? - ap latest news
TTD Assets: ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా 960 ఆస్తులున్నాయని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 7 వేల ఎకరాల భూమితో పాటు 14 టన్నుల బంగారం, రూ.14 వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.
TTD Assets: శ్రీవారి ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా?
1974 నుంచి 2014 మధ్య కాలంలో టీటీడీకి చెందిన 114 ఆస్తులు అమ్ముడుపోయాయన్నారు. దీని తర్వాత ఒక్కటి అమ్ముడుపోలేదని చెప్పారు. గత ఐదు నెలల్లో విరాళాల ద్వారా టీటీడీకి నెలవారీ ఆదాయం పెరిగిన తరుణంలో ఈ విషయం వెల్లడైంది. టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ. 700 కోట్ల ఆదాయం వచ్చింది.
ఇవీ చదవండి: