రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇవాళ మరో ముగ్గురికి కొవిడ్-19 సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే 41 మంది కరోనా బారిన పడగా.. ఆ సంఖ్య తాజాగా 44కు చేరింది.
తెలంగాణలో 44కు కరోనా కేసులు.. ఇద్దరు వైద్యులకూ పాజిటివ్ - వైద్యులకు సోకిన కరోనా
14:16 March 26
తెలంగాణలో 44కు కరోనా కేసులు.. ఇద్దరు వైద్యులకూ పాజిటివ్
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధరణ అయ్యింది. తను ఇటీవలే దిల్లీ నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ వ్యక్తి నుంచి ఇతనికి వైరస్ సంక్రమించినట్లు గుర్తించారు.
హైదరాబాద్ దోమలగూడకు చెందిన భార్యా భర్తలు కొవిడ్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిద్దరూ వైద్యులు కావడం గమనార్హం. 43 ఏళ్ల వైద్యుడికి కరోనా రోగి నుంచి వైరస్ వ్యాపించగా.. అతని నుంచి ఆయన భార్యకూ వైరస్ సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ కేసుల సంఖ్య 9కి చేరింది. వైద్యులు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
ఇవీచూడండి:దేశంలో మరింత పెరిగిన కరోనా మృతుల సంఖ్య