Three Floors Building Collapse in Tirupati: తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న భవానీనగర్‌లో పాత భవనం కూలిన ఘటన స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. ప్రాచ్య కళాశాల సమీపంలో 60 ఏళ్ల క్రితం నిర్మించిన 3 అంతస్తుల భవనం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే భవనం శిథిలావస్థకు చేరడంతో 2 ఏళ్ల క్రితం యజమానులు ఖాళీ చేశారు.
Building collapse: అర్ధరాత్రి కుప్పకూలిన మూడంతస్తుల భవనం... ఉలిక్కిపడ్డ స్థానికులు
తిరుపతిలోని భవానీ నగర్లో మూడు అంతస్తుల పాత భవనం శనివారం రాత్రి ఒక్కసారిగా(three floors building collapse in tirupati) కుప్పకూలింది. దీంతో స్థానికులు పరుగులు తీశారు. భవనంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Building collapse
ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనం.. ఒక్కసారిగా భారీ శబ్ధంతో కుప్పకూలడంతో(building collapse at tirupati) స్థానికులు భయపడ్డారు. ఆ భవనం చుట్టూ నాలుగైదు అంతస్తుల భవనాలు ఉండగా... వాటిలో నివసిస్తున్న వారంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కుప్పకూలిన భవనం యజమాని ఎంజీ శ్రీనివాసన్.. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.