GHMC FINE: ప్రపంచ గుర్తింపు పొందిన నగరంగా హైదరాబాద్ ఎదుగుతోంది. దీనికి అనుగుణంగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి నగర పాలక సంస్థ సిద్ధమైంది. బల్థియాలోని చెత్తను ఎక్కడికక్కడ పారివేయకుండా చర్యలు తీసుకుంటుంది. అందుకు అనుగుణంగా అటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ చెత్తను వేయడానికి కుండీలను ఏర్పాటు చేశారు. ఇంక ఎవరయినా ఇష్టానుసారం చెత్త వేస్తే రూ.1000 జరిమానా కట్టాల్సిందే అని జీహెచ్ఎమ్సీ తెలిపింది.
చెత్త బయట పడేస్తున్నారా, జరిమానా తప్పదు
GHMC FINE ఇష్టానుసారం చెత్తపారేస్తున్నారా? ఇక మీరు రూ.1000 జరిమానా కట్టాల్సిందే. ఇక నగరంలో ఎక్కడైనా చెత్త వేయాలంటే ప్రజలు భయపడే విధంగా జీహెచ్ఎమ్సీ ఏర్పాట్లు చేసింది.
జీహెచ్ఎమ్సీ
ఈ మేరకు నగరంలో జీహెచ్ఎమ్సీ బోర్డులు ప్రదర్శించింది. నిత్యం చెత్తకుప్పలు పోగవుతున్న 1200 ప్రాంతాలను బల్దియా గుర్తించింది. మొక్కలు నాటడం, రంగులు వేయడంతో పాటు సుందరీకరణ పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు సర్కిళ్ల పరిధిలోని పారిశుద్ధ్య ఇంజినీర్లు, వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. చెత్తతొలగించిన చోట మళ్లీ వేస్తే జరిమానా వేస్తామని బోర్డులు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: