తెలంగాణ

telangana

ETV Bharat / city

వాల్తేర్ డీజిల్ లోకోషెడ్ నూతన ఆవిష్కరణ

విశాఖలోని వాల్తేర్ డీజిల్ లోకోషెడ్​.. నూతనంగా ఓ పరికరాన్ని ఆవిష్కరించింది. చేతితో తాకకుండానే.. హ్యాండ్ వాష్, థర్మల్ స్కానింగ్, శానిటైజర్​ సేవలు పొందే విధంగా రూపొందించారు. విశాఖలోని వాల్తేర్ డీఆర్​ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ ప్రోత్సాహంతో మెకానికల్ ఇంజనీర్ సంతోష్ కుమార్.. ఈ పరికరాన్ని తయారు చేశారు.

VISAKHAPATNAM RAILWAY
వాల్తేర్ డీజిల్ లోకోషెడ్ నూతన ఆవిష్కరణ

By

Published : Nov 19, 2020, 10:19 PM IST

విశాఖలోని వాల్తేర్​ డీజిల్ లోకోషెడ్.. సెన్సార్ ఆధారిత హ్యాండ్ వాష్, థర్మల్ స్కానింగ్, హ్యాండ్ శానిటైజర్ పంపిణీ పరికరాలను రూపొందించింది. లోకో షెడ్ సారథి సంతోష్ కుమార్ పాత్రో బృందం.. ఆవిష్కరణలను చేసింది. తాకకుండా ఈ పరికరాలను వినియోగించేలా ఏర్పాటు చేసి.. రైల్వే స్టేషన్​లో అందుబాటులో ఉంచారు.

ఆటోమెటిక్ హ్యాండ్ వాష్ బూత్​, 12 వోల్టుల సొలోనోడ్ వాల్వ్, అల్ట్రాసోనిక్ సెన్సార్ కంట్రోల్ యూనిట్, స్విచ్ఛింగ్ పవర్ సప్లై యూనిట్లతో ఈ పరికరాన్ని రూపొందించారు. ఎల్​సీడీ స్క్రీన్​లో ఉష్టోగ్రత చూపేందుకు... థర్మల్ సెన్సార్ యూనిట్​ని అల్ట్రాసొనిక్ సెన్సార్ కంట్రోల్ యూనిట్, స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లయ్ యూనిట్​లతో కలిపారు. ఆటో హ్యాండ్ శానిటైజర్​నూ ఇదే పరికరాలతో తయారు చేశారు.

వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ ప్రోత్సాహంతో.. డీజిల్ మెకానికల్ ఇంజనీర్ సంతోష్ కుమార్ పాత్రో ఈ పరికరాలను సిద్దం చేశారు. డీఆర్​ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బూత్.. ఉద్యోగులు, సందర్శకులకు ఉపయోగంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ తరహాలోనే ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తామన్నారు.

వాల్తేర్ డీజిల్ లోకోషెడ్ నూతన ఆవిష్కరణ

ఇవీచూడండి:గ్రేటర్​ ఎన్నికల్లో సుప్రీం ఆదేశాలు అమలుచేయాలి: సుపరిపాలన వేదిక

ABOUT THE AUTHOR

...view details