తెలంగాణ

telangana

ETV Bharat / city

POLAVARAM PROJECT: రోడ్డు లేదు.. పడవల్లోనూ రానివ్వరు..!

రోడ్డు మార్గం సరిగా లేకపోగా ముంపు గ్రామాల నుంచి పడవలపై(BOATS) ఆధారపడితే వాటిపై కూడా రాకూడదని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఏపీలోని పోలవరం నిర్వాసితులు(POLAVARAM EXPATRIATES) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్‌ నుంచి అనుమతి లేఖ ఉంటేనే ఆ గ్రామాల్లోకి పడవలపై వెళ్లనిస్తామంటున్నారని అన్నారు. ఇలా ఇబ్బందులకు గురిచేయడం తగదని అన్నారు.

there-is-no-road-polavaram-residents-who-do-not-come-in-boats-are-facing-problems
రోడ్డు లేదు.. పడవల్లోనూ రానివ్వరు..!

By

Published : Jul 8, 2021, 10:54 AM IST

Updated : Jul 8, 2021, 11:14 AM IST

ఆంధ్ర ప్రదేశ్​లోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల(POLAVARAM PROJECT) కష్టాలు ఇన్నీ అన్నీ కావు. వారికి పునరావాస కాలనీలు(Resettlement)నిర్మించి, అవసరమైన ప్యాకేజీలు ఇచ్చి గౌరవంగా తరలించాల్సి ఉండగా ఆ పని చేయలేదు. అసలే కాఫర్‌ డ్యాం నిర్మాణంతో ముంపు పెరిగింది. ఏ అవసరం పడినా బయటి ప్రాంతాలకు రావాలంటే రోడ్డు మార్గం(NO ROADS) లేదు. పడవల్లో వస్తే అలా ప్రయాణానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు. తహసీల్దార్‌ నుంచి అనుమతి లేఖ ఉంటేనే ఆ గ్రామాల్లోకి పడవలపై వెళ్లనిస్తామంటున్నారు. పోలవరం మండలంలోని చీడూరు, టేకూరు తదితర ముంపు గ్రామాల నుంచి బుధవారం కొందరు నిర్వాసితులు పోలవరం వచ్చారు. పోలవరం స్పిల్‌వే వెనక భాగానికి చేరుకుని అక్కడి నుంచి ఆటోలో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ‘పిల్లలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు.. వైద్యం కోసం పోలవరం వచ్చాం.

రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో పడవలపై రావాల్సి వస్తోంది. ముంపు గ్రామాల నుంచి పడవలపై రాకూడదని పోలీసులు ఆపి ఇబ్బంది పెడుతున్నారు. వెనక్కు వెళ్లాలంటే తహసీల్దార్‌ నుంచి అనుమతి లేఖ కావాలని అడుగుతున్నారు’ అంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన బియ్యం, కందిపప్పు సరిపోవడం లేదని, సరకులు కొనుక్కోవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారని సుంకురు రామాయమ్మ అనే నిర్వాసితురాలు చెప్పారు. పునరావాసం చూపకుండా ఇలా ఇబ్బందులు పెడితే ఎలాగని ప్రశ్నించారు. పునరావాసం చూపించలేదు.. భూమికి భూమి ఇవ్వలేదని టేకూరుకు చెందిన బడగంటి పద్మ వాపోయారు. ప్యాకేజీ ఇస్తే వెంటనే ఊరు ఖాళీ చేసి వెళ్లిపోతామన్నారు.

పోలవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చంటి పిల్లలతో వేసి ఉన్న నిర్వాసితులు

తహసీల్దార్‌కు ఫిర్యాదు....

పోలీసులు రానివ్వకపోవడంతో చీడూరు, టేకూరు గ్రామాల ప్రజలు పోలవరం తహసీల్దార్‌ సుమతిని కలిసి సమస్యలు చెప్పారు. నిర్వాసితులను తరలించే పనుల్లోనే ఉన్నామని ఆమె చెప్పారు. పడవలపై రావద్దని.. తల్లవరం మీదుగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అటే రావాలని ప్రజలకు సూచించారు. ఆ గ్రామాల వారిని వెనక్కు పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్‌ఐను ఆదేశించారు.

పిల్లలకు వైద్యం కోసం వచ్చాం...

పిల్లలు జ్వరాలతో ఇబ్బంది పడుతుంటే చంకన వేసుకుని వైద్యం కోసం వచ్చాం. పోలీసులు పోలవరం చెక్‌పోస్టు వద్ద అడ్డుకున్నారు. చీడూరు గ్రామంలోని 148 కుటుంబాలకు పి.అంకాపాలెం వద్ద పునరావాస కాలనీ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ప్యాకేజి ఎప్పుడు ఇస్తారో తెలియదు. వరదలు రాకముందే దారులు మూసుకుపోయాయి. ఇక వరదలొస్తే మా పరిస్థితి ఏమిటో తెలియడం లేదు.

వేలిముద్రల కోసం వస్తే అడ్డుకున్నారు...

వైఎస్‌ఆర్‌ బీమా పథకం గడువు ముగుస్తుంది వెంటనే పోలవరం వచ్చి వేలిముద్రలు వేయమంటే నిర్వాసితులు పడవలపై వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముంపు గ్రామాల్లో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించలేదు. ప్యాకేజి ఇవ్వలేదు. 18 సంవత్సరాలు నిండి, ఇటీవల వివాహం చేసుకున్నవారి విషయంలో స్పష్టత లేదు. కొండపోడు భూమికి భూమి ఇవ్వాలి. దాని గురించీ అధికారులు పట్టించుకోవడం లేదు.

సురక్షిత మార్గంలోనే ప్రయాణించాలనే...

పునరావాస కాలనీల్లో మరుగుదొడ్లు, తాగునీరు సౌకర్యాలు కల్పిస్తున్నాం. వారం రోజుల్లోగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. తర్వాత నిర్వాసితులను తరలిస్తాం. ప్రస్తుతం మునిగిపోయిన మార్గంలో ప్రయాణించటం ప్రమాదం కాబట్టి ఆ దారిలో రాకపోకలు నిలిపివేశాం. సురక్షిత ప్రయాణానికి మరో మార్గం ఏర్పాటు చేస్తున్నాం.- కార్తికేయ మిశ్రా, కలెక్టర్‌

ఇదీ చదంవండి:Tragedy: ముగ్గురు కుమార్తెలకు ఉరేసి తల్లి బలవన్మరణం

Last Updated : Jul 8, 2021, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details