ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని పడకండ్ల బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గురుకుల పాఠశాల పక్కనే ఉన్న ఏరు పొంగి ప్రవహించింది. ఈ ప్రవాహంతో వరద నీరు గురుకులంలోకి చేరింది. విద్యార్థులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వారితోపాటు పాఠశాల సిబ్బంది ఉండిపోయారు. ప్రసార మాధ్యమాల ద్వారా విషయం తెెలుసుకున్న ఉన్నతాధికారులు... ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. ఆ బస్సు కూడా వరదల్లో చిక్కుకుంది. పక్కనే ఉన్న గ్రామస్థులతో కలిసి ప్రత్యేకంగా నిచ్చెనలు ఏర్పాటు చేసి... పాఠశాల్లో ప్రవేశించారు. ఒక్కో విద్యార్థిని పక్కనే ఉన్న ప్రైవేటు పాఠశాలకు తరలించారు. అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. సకాలంలో ప్రజలు, అధికారుల స్పందనతో 600 మంది విద్యార్థినులకు ప్రమాదం తప్పింది.
వరదల్లో చిక్కుకున్న విద్యార్థినులు సురక్షితం
అధికారులు, ప్రజల తక్షణ స్పందన 600 మంది విద్యార్థుల ప్రాణాలు నిలబెట్టింది. చుట్టూ నీరు... ఎటు వెళ్లాలో తెలియ నరకయాతన అనుభవించిన విద్యార్థులకు ఉపశమనం కలిగించారు.
వరదల్లో చిక్కుకున్న విద్యార్థినిలు సురక్షితం