illegal liquor exporters: రాష్ట్రంలో రోజురోజుకు అక్రమమద్యం సరఫరా, గంజాయి వాడకం, సాగు, సరఫరా పెరుగుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ తేల్చింది. కొన్నిచోట్ల గుడంబా అక్కడక్కడ తయారు చేస్తూ స్థానిక అవసరాలతోపాటు డిమాండ్ ఉన్న ప్రాంతాలకు సరఫరాచేసి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించింది. గత ఐదేళ్లుగా స్టేషన్ల వారీగా నమోదైన కేసుల సంఖ్య, విభాగాలవారీగా ఎలాంటి కేసులు నమోదయ్యాయి, ఏ వర్గాలు ఆ నేరాల్లో భాగస్వాములు అవుతున్నారని అధ్యయనం చేసింది.
ఆంధ్ర, ఒడిషా సరిహద్దు గుండా భారీగా సరఫరా:ప్రధానంగా సంగారెడ్డి, అదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట్‌జిల్లాల్లో గంజాయి సాగుచేస్తున్నట్లు గుర్తించారు. ఆంధ్ర, ఒడిషా సరిహద్దు నుంచి భారీగా సరఫరా అవుతున్నట్లు నిర్ధరించారు. ఇటీవల పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు నమోదు చేసిన కేసులు, సీజ్ చేసిన పరిమాణం బట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. పలు గ్రామాల్లో అక్కడక్కడ గుడుంబా తయారుచేస్తున్నట్లు గుర్తించిన అధికారులు సరకు ఎక్కడికి సరఫరా చేస్తున్నారన్న అంశంపై ఆరాతీశారు. వాటిపై ఆయాఎక్సైజ్ స్టేషన్ల అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు ప్రత్యేక దృష్టిసారించాలని కమిషనర్ స్పష్టంచేశారు.
గంజాయి సాగుదారులను గుర్తించిన అధికారులు:రాష్ట్రంలో 139 ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ల ఉండగా 16 స్టేషన్ల పరిధిలో 60 మంది గంజా సాగుచేస్తున్నట్లు గడిచిన ఐదేళ్లకు చెందిన కేసులు పరిశీలించిన తర్వాత ఆయాప్రాంతాలపై నిఘా పటిష్టంచేశారు. వివిధ ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న మొక్కలు గుర్తించి నాశనం చేసిన అధికారులు వారిపై కేసులు నమోదు చేశారు. వారికి రైతుబంధు నిలిపివేయాలని చేయాలని ప్రభుత్వానికి ఎక్సైజ్ ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు. మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గోవా నుంచి వచ్చిన 90 కాటన్లు, కర్ణాటక నుంచి గద్వాలకు వచ్చిన 40 కాటన్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ తక్కువ ధరకు తీసుకొచ్చి.. ఇక్కడ విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
గుడుంబా తయారీ పెరిగే అవకాశం: ఈజనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 850 కేసుల్ని ఎక్సైజ్‌అధికారులు నమోదు చేశారు. అందులో గుడుంబాకు చెందినవి 623 ఉండగా 612 మందిని అరెస్టు చేశారు. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులు గడిచిన 9 నెలల్లో 46 నమోదుకాగా 59 మందిని అరెస్టు చేసి 16 వాహనాలను సీజ్ చేసి 124 మందిని బైండోవర్ చేయించారు. గడుంబాకు చెందిన 26 మంది, మాదకద్రవ్యాలవిక్రయాలకు సంబంధించి 31 మందిపై పీడీచట్టం కింద కేసు నమోదు చేశారు. దసరాకి బయట రాష్ట్రాల నుంచి నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ గుడుంబా తయారీ పెరిగే అవకాశం ఉండటంతో టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను అప్రమత్తం చేశారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండి అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు.
పండగ వేళ జోరందుకున్న మద్యం విక్రయాలు.. అక్రమదారులపై ఎక్సైజ్‌శాఖ నిఘా!! ఇవీ చదవండి: