రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ గ్రామశివారులో పక్షులను పట్టుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓవృద్ధుడు వ్యవసాయ బావిలో పడిపోయాడు. చంద్రయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో పక్షులు పట్టుకునేందుకు గ్రామ శివారులో ఉన్న పాతబావి వద్దకు వెళ్ళాడు. బావి అంచున చెట్ల కొమ్మలపై ఉన్న పక్షులను పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ జారి బావిలో పడి పోయాడు.
బావిలో పడ్డ వృద్ధుడు... క్రేన్‌సాయంతో కాపాడిన పోలీసులు - BIRDS
150 అడుగులలోతు ఉన్న పాతబావిలో పడ్డి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న 60 ఏళ్ల వృద్ధుడిని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీసులు రక్షించారు. బావిలో నుంచి అరుపులు వస్తుండటం గమనించిన స్థానిక వ్యవసాయ కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చి క్రేన్ సహాయంతో చంద్రయ్యను బయటకు తీశారు.
బావిలో పడ్డ వృద్ధుడు... క్రేన్‌సాయంతో కాపాడిన పోలీసులు
అరుపులు విని గుర్తించిన స్థానిక వ్యవసాయ కూలీలు
బావిలో నుంచి అరుపులు వస్తుడటం గమనించిన స్థానిక వ్యవసాయ కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకుని కానిస్టేబుల్స్ కృష్ణమాచారి, శ్రీశైలం, కృష్ణ, నరేష్‌లు తాడు సహాయంతో లోపలికు దిగారు. 150 అడుగుల లోతు ఉండటం వల్ల క్రేన్ సహాయంతో చంద్రయ్యను అతికష్టం మీద బయటకు తీసి చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి:ఆరు తీర్మానాలకు పచ్చజెండా ఊపిన జీహెచ్ఎంసీ