జీహెచ్ఎంసీ పరిధిలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఇచ్చే భోజనాల సంఖ్యను రెట్టింపు చేసినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రకటించారు. లాక్డౌన్ నేపథ్యంలో అన్నార్థుల ఆకలిని తీర్చే ఉద్దేశంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కష్ట కాలంలో తిండికి ఇబ్బంది పడుతోన్న పేదలను ఈ క్యాంటీన్లు ఎంతగానే ఆదుకుంటున్నాయి. ఇప్పటి వరకూ లక్షల మందికి ఉచితంగా భోజనం అందించాయి.
అన్నపూర్ణ క్యాంటీన్లలో రెట్టింపైన భోజనాల సంఖ్య - mid day meals
జీహెచ్ఎంసీ పరిధిలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా అందించే భోజనాల సంఖ్యను రెట్టింపు చేశారు. గతంలో రోజుకు 29 వేల మందికి ఆహారాన్ని అందించగా.. లాక్డౌన్ నేపథ్యంలో ఈ సంఖ్యను 72 వేలకు పెంచారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. మే 17 నుంచి మీల్స్‌ను ఉచితంగా అందిస్తోన్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రకటించారు.
అన్నపూర్ణ క్యాంటీన్లు
అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా గతంలో రోజుకు 29 వేల మందికి ఆహారాన్ని అందించగా.. ప్రస్తుతం మీల్స్ సంఖ్యను 72 వేలకు పెంచినట్లు అరవింద్ తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మే 17 నుంచి మీల్స్‌ను ఉచితంగా అందిస్తోన్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:అడవి బిడ్డల ఆకలి తీరుస్తోన్న సీతక్క