తెలంగాణ

telangana

ETV Bharat / city

'దిశ' నిందితుల మృతదేహాలు కుళ్లిపోతున్నాయి! - disha

దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నలుగురు యువకుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రి శవాగారం(మార్చురీ)లో భద్రపరచడంపై ఆసుపత్రి వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు వాటిని గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరచిన విషయం తెలిసిందే!

The bodies of the 'Disha' accused are rotting
The bodies of the 'Disha' accused are rotting

By

Published : Dec 17, 2019, 8:27 AM IST

దిశ నిందితుల మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. రోజులు గడుస్తుండటంతో దుర్వాసన వస్తున్నాయి. నిజానికి ఈనెల 13 వరకే వాటిని భద్రపరచాలని చెప్పిన గడువు ముగిసినా వాటి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

ఎంబాంబింగ్‌ చేస్తే...

ఎంబాంబింగ్‌ చేస్తే రెండు వారాలపాటు భద్రపరచవచ్చు. కానీ రీ పోస్టుమార్టానికి అవకాశం ఉండదు. ఎంత శీతల ప్రదేశంలో ఉంచినా వారం వరకే ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా కుళ్లిపోతుంటాయి. ఈ విషయాన్ని గుర్తించి ఆసుపత్రి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండటంతో తీర్పు రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో మృతదేహాలను దిల్లీలోని అధునాతన మార్చురీకి తరలించాలని ప్రభుత్వాన్ని కోరే ప్రయత్నాలు చేస్తున్నట్లు సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details