దేశవ్యాప్తంగా వైద్యసేవల పనితీరులో తెలుగు రాష్ట్రాలు పురోగమిస్తున్నాయి. ఆరోగ్య వ్యవస్థ బలోపేతం - రాష్ట్రాల వారీగా 2018-19 పేరిట... జాతీయ ఆరోగ్య మిషన్, జాతీయ ఆరోగ్య వ్యవస్థల వనరుల కేంద్రం సంయుక్తంగా రూపొందించిన నివేదికను కేంద్రం విడుదల చేసింది. ఏడు ప్రధాన అంశాల ప్రాతిపదికన పనితీరును అంచనా వేయగా ఆంధ్రప్రదేశ్‌కు 7, తెలంగాణకు 5 ప్రోత్సాహక మార్కులు లభించాయి.
తెలంగాణ 13... ఏపీకి 7వ స్థానం..!
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకుని మార్కులను కేటాయించారు. మార్కుల ప్రాతిపదికన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకులను కేటాయించగా మొదటి మూడు స్థానాల్లో దాద్రానగర్ హవేలి. హరియాణా ,అసోం నిలిచాయి. ఏపీ 7వ స్థానం, తెలంగాణ 13వ స్థానంలో నిలిచాయి.
మార్కుల ప్రాతిపదికన నిధుల కేటాయింపు
సాధించిన మార్కుల ప్రాతిపదికన రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయింపు ఉంటుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. 2018-19లో వైద్యసేవల పనితీరులో ప్రోత్సాహక నిధులు సాధించినందుకుగాను తెలంగాణకు రూ.81.76కోట్లు, ఏపీకి రూ.122.68కోట్లు... 2019-20 ఆర్థిక సంవత్సరంలో అదనంగా మంజూరు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
ఇవీ చూడండి: ఇక చర్చలకు ఆస్కారమే లేదు: సీఎం