సొంత గూడు నిర్మాణం కోసం కూడబెట్టిన డబ్బు.. చెదలు పట్టి చిత్తుకాగితాల్లాగా మారాయి. ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరంలో పందుల వ్యాపారం చేసుకునే జమలయ్య... తన వద్ద ఉన్న డబ్బును ట్రంకు పెట్టెలో దాచిపెట్టాడు. రూ.పది లక్షలు పోగు చేసి ఇల్లు కట్టుకుందామనుకున్నాడు. సుమారు రూ.5 లక్షలు దాచిపెట్టాడు. అయితే వ్యాపారం కోసమని దాచిపెట్టిన వాటిలో నుంచి లక్ష రూపాయలు తీసుకునేందుకు ట్రంకు పెట్టె తెరిచాడు.
గూడుకోసం కూడబెట్టిన రూ.5 లక్షలు 'చెదల' పాలయ్యాయి..! - మైలవరం వార్తలు
పందుల వ్యాపారం చేసుకునే బిజిలి జమలయ్యకు బ్యాంకు ఖాతా లేదు. వ్యాపారంలో వచ్చిన లాభాలను ట్రంకు పెట్టెలో భద్రపరిచాడు. ఇల్లు కట్టుకునేందుకు రూ.పది లక్షలు పోగుచేయాలనేది అతని కోరిక. ఇప్పటి వరకు సుమారు రూ.5 లక్షలు కూడబెట్టాడు. అకస్మాత్తుగా వ్యాపారం కోసం రూ.లక్ష కట్టాల్సి వచ్చింది. డబ్బుకోసం ట్రంకు పెట్టెను తెరిచాడు. లోపలున్న నోట్లను చూసి సొమ్మసిల్లి పడిపోయాడు. అసలు ఏం జరిగిందంటే..!
గూడుకోసం కూడబెట్టిన రూ.5 లక్షలు 'చెదల' పాలయ్యాయి..!
లోపలున్న నోట్ల కట్టల పరిస్థితి చూసి బావురుమన్నారు. ట్రంకు పెట్టెలో ఉన్న నోట్లను చెదలు తినేశాయి. కూడబెట్టుకున్న డబ్బు చిత్తుకాగితాల్లాగా మారడం వల్ల కన్నీరుమున్నీరయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు జమలయ్య ఇంటికి వెళ్లి ఆరా తీశారు. పోలీసుల ఎదుట జమలయ్య కుటుంబ సభ్యులు తమ బాధను వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.