నేడు పదో తరగతి ఫలితాలు వెలువడనున్నాయి. సచివాలయంలో ఉదయం పదకొండున్నర గంటలకు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల విద్యార్థుల ఫలితాలు వెంటనే తెలుసుకునేలా వెబ్సైట్లో ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు "టీఎస్ఎస్ఎస్సీ బోర్డు" అనే యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీతో లాగిన్ అయి ఫిర్యాదు చేయవచ్చు. ఒక విద్యార్థి ఒక్కసారి మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
నేడే పది ఫలితాలు... విద్యార్థుల్లో ఉత్కంఠ...
విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఫలితాలు ప్రకటిస్తారు. విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి టీఎస్ఎస్ఎస్సీబోర్డు అనే యాప్ను రూపొందించారు. ఇందులో హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీతో లాగిన్ అయి ఫిర్యాదు చేయవచ్చు.
మూల్యంకనం ఎప్పుడో పూర్తి
మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు... రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల 52వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. మూల్యంకనం కొన్ని రోజుల క్రితమే పూర్తయినప్పటికీ... ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళం కారణంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకే సబ్జెక్టులో ఫెయిలైనా... గైర్హాజరు అయినా... మిగతా సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చి... ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినా... ఆ సమాధానపత్రాలన్నీ మరోసారి పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. వివిధ కోణాల్లో పునఃపరిశీలించిన తర్వాత... నేడు ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేశారు. ఫలితాల విడుదల సమయానికి ప్రధానోపాధ్యాయులందరు పాఠశాలల్లో ఉండాలని విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇది చూడండి:తమిళనాడుకు సీఎం కేసీఆర్- కూటమిపై కసరత్తు