SSC Paper Leak in AP : ఏపీలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ప్రశ్నాపత్రాలు లీకేజీ వార్తలు కలకలం రేపుతున్నాయి. పరీక్షలు ప్రారంభమైన రోజునుంచే ప్రశ్నపత్రాలు లీకైనట్లు వదంతులు రాగా.. అధికారులు విచారణ చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ రోజు సత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి పదో తరగతి ఆంగ్లం పేపర్ లీకైంది. ఉదయం 10 గంటలకే వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం వైరల్ అయింది.
10th Paper Leak in AP : కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.. అయినా ప్రభుత్వం కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ లీక్‌లను నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. మొదటిరోజు తెలుగు ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో రాగా.. రెండో రోజు హిందీ పేపర్ బయటకు వచ్చేసింది. తాజాగా.. ఇవాళ జరుగుతున్న ఆంగ్లం ప్రశ్నాపత్రం లీకైంది.