తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇబ్రహీంపట్నం డిపోలో తాత్కాలిక సిబ్బంది చేతివాటం

ఆర్టీసీ కార్మికుల సమ్మె... తాత్కాలిక సిబ్బందికి వరంలా మారింది. డ్రైవర్లు, కండక్టర్ల నుంచి డబ్బులు తీసుకునే సిబ్బంది అందినంత వరకు దోచుకుంటున్నారు. లెక్కలు చూపేందుకు సరైన ఆధారాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇద్దరు తాత్కాలిక సిబ్బంది చేతివాటం చూపిన తీరు కలకలం సృష్టిస్తోంది.

ఇబ్రహీంపట్నం డిపోలో తాత్కాలిక సిబ్బంది చేతివాటం

By

Published : Nov 6, 2019, 12:20 PM IST

Updated : Nov 6, 2019, 1:54 PM IST

ఇబ్రహీంపట్నం డిపోలో తాత్కాలిక సిబ్బంది చేతివాటం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తాత్కాలిక కార్మికులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సమ్మె నేపధ్యంలో ప్రయాణికుల కోసం తాత్కాలిక సిబ్బందితో కొన్ని రూట్లలో బస్సులను నడపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే విధులు ముగిశాక డ్రైవర్లు, కండక్టర్ల నుంచి డబ్బులు తీసుకునే సిబ్బంది అందినంత వరకు దోచుకుంటున్నారు. ఎండి. అహ్మద్, రమేష్ అనే ఇద్దరు తాత్కాలిక సిబ్బంది దొంగచాటున డబ్బుల సంచులు తీసుకెళ్తుండగా... ఆర్టీసీ ఉద్యోగులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాదాపు 15 నుంచి 20 వేల రూపాయల వరకు స్వాధీనం చేసుకున్నారు.

దొరికితేనే దొంగ..లేదంటే దొర..!

తాత్కాలిక సిబ్బంది ఇంత పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నట్లు బయటపడటంతో రోజు వారి కలెక్షన్స్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారిపై చర్యలను తీసుకోనున్నట్లు ఇబ్రహీంపట్నం డిపో మేనేజరు యేసు తెలిపారు. అధికారుల అండదండలు లేనిదే ఇది సాధ్యంకాదని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కారకులైన వారిపై చర్యలు తీసుకొని ఆర్టీసీని కాపాడాలని సమ్మె చేస్తున్న కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆర్టీసీలో ప్రయాణం.. ప్రత్యక్ష నరకం..!

Last Updated : Nov 6, 2019, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details