తెలంగాణ

telangana

ETV Bharat / city

తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేత..! - కరోనా నిర్ధరణ పరీక్షలు నిలిపివేత

ప్రభుత్వం చేస్తున్న కరోనా నమూనాల పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే సేకరించిన నమూనాల పరీక్షలు పూర్తి కానందున... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆపేసినట్టు సిబ్బంది చెప్తున్నారు.

tempararly stoped corona tests in hyderabad
తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేత..!

By

Published : Jun 25, 2020, 12:52 PM IST

హైదరాబాద్​ చుట్టుపక్కల 50వేల కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి.. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేసింది. కానీ ఆ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒక్కో కేంద్రానికి పెద్ద ఎత్తున జనం పోటెత్తుతున్నారు. భౌతిక దూరం కూడా ఎవరూ పాటించడం లేదు. ఈ రోజు నుంచి కొన్ని ఆసుపత్రుల్లో పరీక్షలు నిలిపివేశారు. ఈ విషయంపై వివరణ కోరగా... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆపేసినట్టు చెబుతున్నారు.

కరోనా నిర్ధరణ పరీక్షలు చేసేందుకు... గోల్కొండ, రామంతపూర్, వనస్థలిపురం, అంబర్​పేట, జియాగూడ, మల్కాజిగిరి, ఆయుర్వేద ఆసుపత్రి, ప్రకృతి చికిత్సాలయాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. కానీ ఇప్పటికే సేకరించిన నమూనాల పరీక్షల ప్రక్రియ పూర్తి కానందున... మల్కాజిగిరి జిల్లా ఆసుపత్రి, జియాగూడ, ఆయుర్వేద ఆసుపత్రుల్లో నమూనాల సేకరణ ఇవాళ నిలిపివేశారు. రెండు రోజుల తర్వాత తిరిగి ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఏపీలో మరో 553 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details