తెలుగు రాష్ట్రాల్లో బస్సులు తిప్పేందుకు ఇరు రాష్ట్రాల చర్యలు - తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రవాణా
13:21 November 02
తెలుగు రాష్ట్రాల్లో బస్సులు తిప్పేందుకు ఇరు రాష్ట్రాల చర్యలు
తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ బస్సులు తిప్పే అంశంపై అధికారులు చర్చించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై కీలక చర్చలు జరపనున్నారు.
అంతర్ రాష్ట్ర ఒప్పందంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు చెరో లక్షా 60 వేల కిలోమీటర్లు తిప్పేందుకు ఏకాభిప్రాయం కుదిరింది. రూట్లవారీగా తిరిగే సర్వీసుల ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పటికే ఫలు దఫాలుగా ఆర్టీసీ అధికారులు సమావేశమై చర్చలు జరిపారు.
ఇదీ చూడండి:నేడు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీల ఒప్పందం..
TAGGED:
rtc bus run in two states