V. C. Sajjanar News : అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్ధేశంతోనే రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ వెల్లడించారు. జేబీఎస్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో కలిసి రక్తదాన శిబిరాన్ని బాజిరెడ్డి ప్రారంభించారు. 50 మంది ఉద్యోగులు రక్తదానం చేయగా.. దాతలకు ధ్రువపత్రాలు అందజేశారు.
TSRTC blood camp : రెడ్‌క్రాస్ సొసైటీ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు డిపోల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. రక్తదాతలకు ఇవాళ బస్సుల్లో ఉచితంగా తిరుగు ప్రయాణ సౌకర్యం కల్పించారు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలను ఆర్టీసీ నిర్వహిస్తోంది.
TSRTC News : మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌ను ఎండీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ ప్రారంభించారు. ఎంజీబీఎస్‌లోని స్టాళ్లలో ధరపై సజ్జనార్ ఆరా తీశారు. తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్న షాపులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు. మూడుసార్ల కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన స్టాళ్లను శాశ్వతంగా మూసివేయాలని ఆదేశించారు.