Political leaders about Rosaiah : మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. రోశయ్య, తాను ఒకేసారి సీఎంలుగా పనిచేశామని అన్నారు. తమిళనాడు గవర్నర్‌గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉందని చెప్పారు. రోశయ్య సేవలు మరువలేనివన్న మోదీ.. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయ పరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది. ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా ఆయన అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’
- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Condolences to Rosaiah family : రోశయ్య మృతిపట్ల సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ సంతాపం ప్రకటించారు. అర్ధశతాబ్ధానికిపైగా రోశయ్య ప్రజలకు సేవలందించారని అన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ పాలనాదక్షుడిగా పేరుపొందారని తెలిపారు. రోశయ్య మృతి తెలుగు ప్రజలకు తీరనిలోటని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసి ఉండాలని కోరుకున్నారని చెప్పారు. విలువలు, సంప్రదాయాలకు రోశయ్య మారుపేరన్న సీజేఐ.. తెలుగుభాష, కళలు, సంస్కృతికి రోశయ్య పెద్దపీట వేశారని వెల్లడించారు.
CM KCR Condolence to Rosaiah family : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు పదవులకు ఆయన వన్నె తెచ్చారని అన్నారు. సౌమ్యుడిగా, సహనశీలిగా తనదైన శైలిని ప్రదర్శించారని కొనియాడారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రోశయ్య మృతిపట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని అన్నారు. నిబద్ధత, ప్రజాసేవ పట్ల అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రేవంత్ ప్రార్థించారు.
Rosaiah Passes Away : రోశయ్య మరణం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ అనగానే రోశయ్య పేరు గుర్తొస్తుందని.. ఆ పదవికి ఆయన అంత పేరు తీసుకువచ్చారని అన్నారు. సౌమ్యుడిగా, నిరాడంబరుడిగా జీవించి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రోశయ్య మృతిపట్ల రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం ప్రకటించారు.
Rosaiah Death News : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. రోశయ్య మృతిపట్ల సంతాపం ప్రకటించారు. తెలుగు ప్రజలకు సుదీర్ఘ కాలం రాజకీయ సేవలు అందించిన ఘనత రోశయ్యదని కీర్తించారు. ఆయన ప్రతిపక్షాలను గౌరవించేవారని గుర్తుచేసుకున్నారు. ఈనాటి రాజకీయ వ్యవస్థ ఆయణ్ని చూసి ఎంతో నేర్చుకోవాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తనను రాజకీయాల్లో రావాలని మనస్ఫూర్తిగా రోశయ్య ఆహ్వానించారని గుర్తుచేసుకున్నారు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ప్రజా జీవితంలో ఒక మహోన్నత నేతగా రోశయ్య ఎదిగారని తెలిపారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడటంలో రుషిలా రోశయ్య సేవలందించారని కొనియాడిన చిరంజీవి.. వివాద రహితులుగా, నిష్కళంకితులుగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా రోశయ్య పేరుగాంచారని పేర్కొన్నారు.
రోశయ్య మరణంపై మంచు మోహన్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజకీయాన్ని శ్వాసగా, రాజకీయ భాషను కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు.
సంబంధిత కథనం
Konijeti Rosaiah passed away : రాజకీయ కురువృద్ధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) కన్నుమూశారు. ఇవాళ ఉదయం రోశయ్య పల్స్ పడిపోయింది. కుటుంబసభ్యులు ఆయణ్ని హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి