తెలంగాణ

telangana

ETV Bharat / city

TRS MPs in Parliament : లోక్‌సభ వెల్‌లో తెరాస ఎంపీల నిరసన

TRS MPs in Parliament : పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో తెరాస ఎంపీల నిరసన రెండో రోజు కొనసాగింది. తెలంగాణలో ధాన్యం సేకరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. ధాన్యం సేకరణపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు.

TRS MPs Protest in Parliament, పార్లమెంట్​లో తెలంగాణ
పార్లమెంట్​లో రెండోరోజు తెరాస ఎంపీల నిరసన

By

Published : Nov 30, 2021, 9:55 AM IST

Updated : Nov 30, 2021, 11:52 AM IST

TRS MPs in Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండోరోజు కూడా తెరాస ఎంపీల నిరసన కొనసాగుతోంది. ఉదయాన్నే ఉభయ సభల్లో తెరాస ఎంపీలు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ధాన్యం సేకరణలో జాతీయ విధానం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వరదలు, పంట నష్టాలకు పరిహారంపై చర్చించాలని నోటీసులు సమర్పించారు. రాజ్యసభలో ఎంపీ కేకే, లోక్‌సభలో నామ నాగేశ్వరరావు నోటీసులు అందించారు.

గాంధీ విగ్రహం వద్ద ఎంపీల నిరసన

లోక్​సభ వెల్​లో తెరాస ఎంపీలు నిరసన తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. సభ నుంచి కాంగ్రెస్, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్ వాకౌట్ చేశారు. విపక్షాల ఆందోళనలతో లోక్​సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

తెరాస ఎంపీలు

Paddy Procurement : సోమవారం రోజున ఉభయసభల్లో తెరాస ఎంపీలు ప్రత్యక్ష ఆందోళన చేశారు. సెంట్రల్ హాల్, గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కేంద్రం హామీ ఇచ్చేవరకు ఆందోళన చేస్తామమి స్పష్టం చేశారు. తెలంగాణలో ధాన్యం సేకరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెరాస ఎంపీల వాయిదా తీర్మానం నోటీసులు

TRS MPs in Lok Sabha :ధాన్యం సేకరణపై స్పష్టత కోసం పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. తొలిరోజే లోక్​సభలో తెరాస ఎంపీలు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి రైతు సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు. ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయోమయ, అస్పష్టత విధానానాలతో తెలంగాణ రైతులతో పాటు దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందని ఆక్షేపించారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం త‌మ విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని ఎంపీలు డిమాండ్ చేశారు.

తెరాస ఎంపీల వాయిదా తీర్మానం నోటీసులు

ఇదీ చదవండి :

Parliament Winter Sessions 2021: పార్ల‌మెంట్‌లో తొలి రోజే ర‌భ‌స మొద‌లైంది. లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Last Updated : Nov 30, 2021, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details