ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలువిశ్వనాథుని సన్నిధి.. ఎవరికో పెన్నిధి.. UP Varanasi Election 2022: వారణాసిలో రాజకీయ వేడి పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో భాజపాదే హవా. ఇక్కడ మరింత పట్టు సాధించాలని కమలనాథులు భావిస్తున్నారు. కొన్ని సామాజిక వర్గాలు ప్రతి ఎన్నికల్లో ప్రాబల్యం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ కుల సమీకరణాలపైనే ఆశలు పెట్టుకున్నాయి.విశాఖలో ఫ్లీట్ రివ్యూ.. President Fleet Review: భారత నౌకా శక్తిని మదింపు చేసే 'ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ' ఇవాళ విశాఖ తీరంలో జరగనుంది. ఈ పరేడ్‌లో పాల్గొనేందుకు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖపట్నం చేరుకున్నారు. రామ్‌నాథ్ కోవింద్‌కు.. ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ ఘన స్వాగతం పలికారు. సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.ఠాణాల్లో అత్యాధునిక కెమెరాలు CC Cameras: పోలీస్ ఠాణాల్లో సీసీ కెమెరాల వ్యవస్థకు చికిత్సచేసే కీలక కార్యాచరణకు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. దేశంలోని పలు ఠాణాల్లో తరచుగా కస్టడీ మరణాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ ప్రాజెక్టుకు బీజం పడింది.గొర్రెల పంపిణీ పథకం అమలుపై అనిశ్చితిSheep Distribution Scheme: గొర్రెల పంపిణీ పథకం తాత్కాలికంగా నిలిచిపోయింది. నిధుల కొరత ఈ పథకానికి అడ్డంకిగా మారింది. రుణం ఇవ్వాలని ఎన్సీడీసీకి రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య దరఖాస్తు చేయగా.. రుణం ఇంకా మంజూరు కాలేదు. ఇవి వస్తేనే కాపరులకు పూర్తిస్థాయిలో పంపిణీ సాధ్యమవుతుంది.పుట్టినరోజు నాడే బాలికపై సామూహిక అత్యాచారం Girl Gangrape: ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు మానవమృగాలు. కర్ణాటకలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్లేగులోనూ పైశాచికంగా..అడుగడుగునా భారతీయులను కించపరచటమో, అవమానించటమో, వివక్ష చూపించటమో చేసిన ఆంగ్లేయులు ఆఖరుకు ప్లేగు మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలోనూ పైశాచికంగా ప్రవర్తించారు. మహిళలను వివస్త్రలుగా చేసి రోడ్లపై నిలబెట్టి ఆనందించారు. బ్రిటన్‌లోనూ ఆందోళన వ్యక్తమైన ఈ నిస్సిగ్గు సంఘటనలో ఆఖరికి బాధ్యుడైన ఆంగ్లేయ అధికారికి ప్రజలే తగిన శిక్ష విధించారు.డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా యాప్ రెడీ.. Trump Social Media App: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా యాప్ ప్రారంభమైంది. 'ట్రూత్ సోషల్ (TRUTH Social)' పేరుతో ఉన్న ఈ యాప్ ఫిబ్రవరి 21న అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఇది యాపిల్‌కు చెందిన యాప్ స్టోర్‌లోనే అందుబాటులో ఉండనుంది.1.7 మి.డాలర్ల ఎన్‌ఎఫ్‌టీలు దొంగిలించిన హ్యాకర్లుOpenSea NFT marketplace: నాన్ ఫంజిబుల్ టోకెన్స్ మార్కెట్‌ప్లేస్ అయిన 'ఓపెన్‌సీ' హ్యాకింగ్ బారినపడింది. దాదాపు 1.7 మిలియన్ డాలర్లను హ్యాకర్లు దొంగలించినట్లు తెలుస్తోంది. యూజర్ల ఇ-మెయిల్ ఐడీ వంటి వివరాలు లీక్ అవ్వడం వల్లే ఈ సైబర్ దాడి జరిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.టీమ్‌ఇండియా వయా వైమానిక దళం Saurabh Kumar Cricketer: ఇటీవల బీసీసీఐ యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించడంపై ప్రాధాన్యం పెంచింది. తాజాగా శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌తో మరో కొత్త ఆటగాడు భారత జట్టులోకి అడుగుపెట్టనున్నాడు. అతడే సౌరభ్ కుమార్. అతడి గురించే ఈ కథనం..వెండితెరపై 'తెలుగు' వెలుగులుTelugu title movies: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ చిత్రాలకు మళ్లీ మునపటి తెలుగు వెలుగులు కనిపిస్తున్నాయి. పలువురు దర్శక నిర్మాతలు, హీరోలు తమ సినిమాలకు స్వచ్ఛమైన తెలుగు పేర్లను టైటిల్స్‌గా పెట్టుకుంటున్నారు. నేడు ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా అచ్చమైన తెలుగు పేర్లతో రానున్న చిత్రాలు ఏంటో తెలుసుకుందాం...