ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు'మార్పునకు తరుణమిదే' CM KCR MUMBAI TOUR: దేశంలో గుణాత్మక మార్పునకు సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే అభిప్రాయపడ్డారు. దేశ హితం కోసం ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిపై ఉద్ధవ్‌ఠాక్రే, శరద్ పవార్‌లతో చర్చించిన కేసీఆర్.. త్వరలో దేవెగౌడ, స్టాలిన్‌లతోనూ సమావేశం కానున్నారని తెరాస వర్గాలు చెబుతున్నాయి.నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం పర్యటనCM KCR SANGAREDDY TOUR: కరవు సీమకు గోదావరి జలాలు అందించే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డి జిల్లాలో బీడు భూములను సస్యశ్యామలం చేసేలా రెండు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.కేసీఆర్ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా ప్రకాశ్‌రాజ్ Prakash Raj With KCR: సీఎం కేసీఆర్ ముంబయి పర్యటనలో నటుడు ప్రకాశ్‌రాజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. స్వాగతం పలకటం దగ్గర్నుంచి పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే వరకు కేసీఆర్ వెంటే ఉండి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకూ.. కేసీఆర్ పర్యటనలో ఎవరూ ఊహించని విధంగా.. ప్రకాశ్‌రాజ్ ఇంత చురుకుగా పాల్గొనటానికి కారణాలేంటీ..?'తెలంగాణ విధానాలు దేశవ్యాప్తం కావాలి'KTR in Harvard India Conference: దేశంలో ఉన్నవనరులు, అవకాశాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే భారతదేశం పురోగతి ఆపడం ఎవరి తరం కాదని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. "2030 నాటికి భారతదేశ అభివృద్ధి" అనే అంశంపైన హార్వర్డ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్ దృశ్యమాద్యమం ద్వారా మాట్లాడారు. భారత్ అభివృద్ధి మరింత వేగవంతంగా, విప్లవాత్మకంగా ముందుకు పోవాలంటే కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉందన్నారు.ఘోర ప్రమాదం మెదక్ జిల్లా హవేళిఘనపూర్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో తల్లీకుమార్తె మృతి చెెందగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. నేటి నుంచి క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణRegularisation From Today: ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణకు.. ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చే నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 125 గజాల దాకా ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు.'విపక్షాల పోటీ రెండో స్థానం కోసమే' Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తాము ఎవరితోనూ పోటీపడటం లేదని అన్నారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్. విపక్షాలు ద్వితీయ స్థానం కోసమే పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదులంటే సమాజ్‌వాదీకి సానుభూతి అని ఆరోపించారు. ఆ పార్టీలో కించిత్తు మార్పు లేదని అన్నారు.'పుతిన్‌తో చర్చలకు బైడెన్ సిద్ధం'Ukraine crisis: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని నివారించేందుకు పుతిన్‌తో బైడెన్ చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. రానున్న రోజుల్లో రష్యా దాడి చేయకుండా ఉంటే తాను కూడా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ను కలవనున్నట్లు చెప్పారు.టీ20ల్లో అగ్రస్థానానికి టీమ్ఇండియా IND vs WI: వన్డే సిరీస్‌లో 3-0తో విజయభేరీ మోగించిన టీమ్ఇండియా.. టీ20 సిరీస్‌లోనూ అదే ఫలితం ఫునరావృతం చేసింది. దీంతో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఈ సిరీస్ విజయంతో అంతర్జాతీయ టీ20ల్లో టీమ్ఇండియా అగ్రస్థానానికి చేరుకుంది.ఆలియా సినిమాపై కంగన షాకింగ్ కామెంట్స్Kangana alia bhatt: ఆలియా కొత్త సినిమాపై కంగనా రనౌత్ పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేసింది. రూ.200 కోట్లు బూడిద అవుతుందని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.