ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుగోదావరి-కావేరి అనుసంధానంపై సూత్రప్రాయ ఆమోదం Godavari Kaveri link project: గోదావరి-కావేరి అనుసంధానంపై అన్నిరాష్ట్రాలు సూత్రప్రాయ ఆమోదం తెలిపాయని కేంద్రం వెల్లడించింది. గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్టుపై 5 రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశమైంది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో దిల్లీలోని జలశక్తిశాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్‌లో జరిగిన సమావేశానికి జలశక్తి శాఖ, ఎన్‌డబ్ల్యూడీఏ, 5 రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. మోదీ ఇలాఖాలో 'దేశ్ కీ నేత కేసీఆర్'!KCR Hoardings in Varanasi: సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా తెరాస శ్రేణులు, ఆయన అభిమానులు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఆ అభిమానం రాష్ట్రాలు దాటింది. యూపీ వారణాసిలోనూ కేసీఆర్‌కు విషెష్ చెబుతూ భారీ హోర్డింగ్లు వెలిశాయి. ప్రధాని మోదీ నియోజకవర్గంలో సీఎం హోర్డింగ్లు ఏర్పాటు చేయడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.పంజాబ్‌లో కాంగ్రెస్ హామీల వర్షం Congress Manifesto for Punjab polls: పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది. మహిళలకు నెలనెలా రూ. 1100 చొప్పున సాయం అందించనున్నట్లు పేర్కొంది.భాజపాలో లుకలుకలు..Chaos in Uttarakhand BJP: పోలింగ్ అనంతరం ఉత్తరాఖండ్ భాజపాలో అంతర్గత కలహాలు బయటికొస్తున్నాయి. సొంత అనుచరులే తమ ఓటమి కోసం కుట్ర పన్నారని పోలింగ్ అనంతరం ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. రెండోసారి రాష్ట్రంలో అధికారం చేపడతామని భాజపా ధీమా వ్యక్తం చేసినప్పటికీ తాజా పరిణామాలు గందరగోళం సృష్టిస్తున్నాయి.స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్- ముగ్గురు మృతి Durgapur Steel Plant Gas Leak: దుర్గాపుర్ స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ఐదురుగు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.మూడు తరాల తర్వాత కలిసిన రాజవంశీయులుRoyals Meet: సుమారు మూడు తరాల తర్వాత ఏడో నిజాం రాజు మనవడు నవాబ్ మీర్ నజాఫ్ అలీ ఖాన్, మైసూర్ రాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్‌తో భేటీఅయ్యారు. రెండు రాజ వంశస్థుల మధ్య జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.గూగుల్‌లో తప్పులు కనిపెట్టిన ఇంజినీర్‌కు రూ.66కోట్లు! Google Bug Hunter: సాఫ్ట్‌గా డబ్బు సంపాదించాలంటే.. ఓ కొత్త ప్రోగ్రామ్ కనిపెట్టు.. లేదంటే ఓ కొత్త ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేయ్.. సక్సెస్ పొందినవారి నుంచి ఇలాంటి మాటలు వింటుంటాం. కానీ మధ్యప్రదేశ్, ఇందోర్‌కు చెందిన అమన్ పాండేది మాత్రం విభిన్నమైన మార్గం. గూగుల్‌లో ఉండే తప్పులను వెతికి రూ.66 కోట్లు గడించాడు. ఎలాగంటారా..? ఓసారి చూసేయండి.యుద్ధం వస్తే భారత్‌కు తిప్పలే!Ukraine Russia crisis: ఉక్రెయిన్- రష్యా వివాదం మరింత తీవ్రమైతే ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల ప్రభావం పడనుంది. ఇప్పటికే కరోనావైరస్ కారణంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు చాలా దెబ్బతిన్నాయి. తాజాగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి తెరలేచి.. మిగిలిన ప్రపంచ శక్తులు దానిలోకి అడుగుపెడితే భారత్‌పై అది పెనుప్రభావం చూపించనుంది. ముఖ్యంగా చమురు ధరలు, ద్రవ్యోల్బణం, ఆయుధాలు, విదేశాంగ విధానం వంటి వాటిల్లో భారత్‌కు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.టాస్ గెలిచిన విండీస్ India vs West Indies: వెస్టిండీస్‌తో రెండో టీ20లో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 సిరీస్ సొంతం చేసుకోవాలి రోహిత్ సేన భావిస్తోంది.ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన 'భీమ్లా నాయక్' నిర్మాతProducer naga vasmhi: తను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత నాగవంశీ వివరణ ఇచ్చారు. ప్రేక్షకులంటే తమకెంతో గౌరవమని చెప్పుకొచ్చారు. వారి మనసు నొచ్చుకోవడం తనను బాధించిందని అన్నారు.