ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలురాష్ట్రంలో విస్తరిస్తున్న ఒమిక్రాన్ Telangana omicron cases:తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 84కి చేరింది. చికిత్స అనంతరం ఒమిక్రాన్ బాధితుల్లో 32 మంది కోలుకున్నారు.'వర్ధమాన పాత్రికేయులకు అరుణ్‌సాగర్ ఒక స్ఫూర్తి'ArunSagar Awards 2022: పాత్రికేయ, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఏటా అందజేసే అరుణ్‌సాగర్ ట్రస్ట్ విశిష్ట పురస్కారాల వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. 2022 సంవత్సరానికి గానూ సాహిత్య రంగంలో ప్రముఖ కవి, విమర్శకులు ప్రసాదమూర్తికి విశిష్ట సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయగా... పాత్రికేయ రంగంలో ఈనాడు ఏపీ సంపాదకులు మానుకొండ నాగేశ్వర్ రావు విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని అందుకున్నారు.త్వరలో యాదాద్రికి సీఎం కేసీఆర్ CM KCR visit to Yadadri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఉద్ఘాటన తేదీ సమీపిస్తుండటంతో పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సంక్రాంతి పర్వదినం తర్వాత కేసీఆర్.. యాదాద్రికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.విశాఖలో విషాదంVisakha RK beach: హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లిన విహారయాత్ర విషాదాంతమైంది. ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. హైదరాబాద్ బేగంపేటకు చెందిన 8మంది స్నేహితులు ఈనెల 30న కాచిగూడ నుంచి ట్రైన్లో విశాఖ బయలుదేరి వెళ్లారు. నగరానికి చెందిన శివ అనే యువకుడు... సముద్రంలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. 'పిల్లలకు కరోనా టీకా- ఈ విషయం మరవొద్దు' Vaccination Children: 15-18 ఏళ్ల వయస్సు వారికి టీకా పంపిణీ నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. వ్యాక్సిన్ మిక్సింగ్ గందరగోళం నెలకొనకుండా ఉండేందుకు.. ప్రత్యేక టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.ముంబయిలో ఒక్కరోజే 8వేల కరోనా కేసులు Mumbai Covid Cases: భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క ముంబయిలోనే 8 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. బంగాల్లో ఒక్కరోజే 6 వేలమందికిపైగా వైరస్ సోకింది. దిల్లీలో 3194, కేరళలో 2802, కర్ణాటకలో 1187 కేసులు నమోదయ్యాయి.ఒమిక్రాన్.. నేచురల్ వ్యాక్సినా? సోకితే మంచిదేనా?Omicron Natural vaccine: ఒమిక్రాన్ వ్యాప్తి మంచిదేనా? ఈ వేరియంట్ నేచురల్ వ్యాక్సిన్‌లా పనిచేసి కొవిడ్‌ను అంతం చేస్తుందా? మహారాష్ట్ర వైద్యాధికారి చేసిన పలు వ్యాఖ్యలతో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఆయనేం చెప్పారు? దీనిపై ఇతర నిపుణులు ఏమన్నారు? ఓసారి చూస్తే...భార్యా పిల్లల్ని చంపి బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్యBank Employee suicide: ఓవైపు అప్పుల బెడద.. మరోవైపు ఇంటి ఇల్లాలితో గొడవ.. ఈ సమస్యలతో కొట్టుమిట్టాడలేక తనువు చాలించాడు ఓ బ్యాంకు ఉద్యోగి. చనిపోయే ముందు భార్య, పిల్లలను హత్య చేశాడు. తమిళనాడులో జరిగింది ఈ ఘటన.ఫుట్‌బాల్ స్టార్ మెస్సీకి కరోనాLionel Messi Covid: అర్జెంటినా ఫుట్‌బాల్ స్టార్ లియోనాల్ మెస్సీకి కరోనా సోకింది. మెస్సీతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు పాజిటివ్‌గా తేలిందని పీఎస్జీ ఫుట్‌బాల్ క్లబ్ పేర్కొంది.'రాధేశ్యామ్' రిలీజ్‌పై డైరెక్టర్ క్లారిటీRadhe Shyam: రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడిన నేపథ్యంలో 'రాధేశ్యామ్' విడుదల తేదీపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై స్పష్టతనిచ్చారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.