ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలున్యూఇయర్ వేళ తీవ్ర విషాదం Road accident: నూతన సంవత్సర వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంతా ఆనందంగా ఉండగా.. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడ్గీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. కారు, ద్విచక్రవాహనం ఢీకొని నలుగురు మృతి చెందారు. 2021లో మహిళలపై పెరిగిన దాడులు- 50% యూపీలోనేCrime Against Women: 2021లో మహిళలపై దాడులు 30 శాతం పెరిగాయి. జాతీయ మహిళా కమీషన్- ఎన్సీడబ్ల్యూ ఈ మేరకు తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఒక్క సంవత్సరంలోనే 30 వేలకుపైగా ఫిర్యాదులు అందగా.. ఉత్తర్ ప్రదేశ్ నుంచే సుమారు 15 వేలు ఉన్నట్లు తెలిపింది.'నాకు ప్రాణభయం ఉంది.. చర్యలు తీసుకోండి' Karate kalyani complaint : ఆధ్యాత్మిక వేదిక శివశక్తి ఫౌండేషన్ నిర్వాహకులతో తనకు ప్రాణభయం ఉందని సినీనటి కరాటే కల్యాణి పోలీసులను ఆశ్రయించింది. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ.. బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసింది.పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులుNew year drunk and drive: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతమంది మందుబాబులు నానా హంగామా చేశారు. మత్తులో వాళ్లు చేసిన వీరంగాలతో పోలీసులకు చుక్కలు కనిపించాయి.వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు GST Collection in December 2021: జీఎస్టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లకుపైనే నమోదయ్యాయి.'అణు' వివరాలు ఇచ్చిపుచ్చుకున్న భారత్-పాక్India Pakistan Nuclear Exchange: భారత్, పాకిస్థాన్ తమ దేశాల్లోని అణు స్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. దౌత్య మార్గాల్లో దిల్లీ, ఇస్లామాబాద్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేశాయి. దీంతోపాటు ఖైదీల వివరాలను కూడా భారత్, పాక్ పరస్పరం అందజేసుకున్నాయి.వినూత్నంగా 'న్యూ ఇయర్' విషెస్- ఐస్‌క్రీమ్ పుల్లలతో..Happy new year 2022: కొత్త ఏడాదికి ఒడిశాకు చెందిన ఓ యువ కళాకారుడు వినూత్నంగా స్వాగతం పలికాడు. ఐస్‌క్రీమ్ పుల్లలతో 'హ్యాపీ న్యూ ఇయర్ 'అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. పూరీ జిల్లా కుముటి పట్నా ప్రాంతానికి చెందిన బిశ్వజిత్ నాయక్ ఈ కళారూపాన్ని తీర్చిదిద్డాడు. ఇందుకోసం అతడు 275 ఐస్‌క్రీమ్ పుల్లలను ఉపయోగించాడు.'రుతురాజ్ ఓ సంచలనం.. కానీ'Ruturaj Gaikwad News: దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపికైన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ సంచలమని ప్రశంసించాడు మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. అయితే అతడికి తుది జట్టులో అవకాశం రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.కొడుకుపైనా దయ చూపని బ్రెట్‌లీ.. క్లీన్‌బౌల్డ్ చేసి!Brett Lee News: మేటి బ్యాటర్లపై ఫాస్ట్ బాల్స్‌తో విరుచుకుపడిన మాజీ స్టార్ బౌలర్ బ్రెట్‌లీ. ఆటకు దశాబ్దం కిందటే వీడ్కోలు పలికిన అతడు మరోసారి బంతి చేతబట్టాడు. ఈ సారి నిర్దయగా తన కుమారుడిని క్లీన్‌బౌల్డ్ చేశాడు.''ఆర్ఆర్ఆర్'లో ఆ సీక్వెన్స్.. ప్రేక్షకులు ఊపిరి తీసుకోవడం మర్చిపోతారు'RRR movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఓ సీక్వెన్స్ గురించి రాజమౌళి అదిరిపోయే రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. ఆ సన్నివేశాలు వస్తున్నప్పుడు ప్రేక్షకులు ఊపిరి తీసుకోవడం కూడా ఆపేస్తారని ఆయన అన్నారు. ఇంతకీ ఆ సీక్వెన్స్ ఏమై ఉంటుందో?