తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9AM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana news, top news
టాప్‌టెన్ న్యూస్, తెలంగాణ వార్తలు

By

Published : May 17, 2021, 8:59 AM IST

  • కొవిడ్‌ చికిత్సలో కొత్త మందు

కంటికి కనిపించని కొవిడ్‌ వైరస్‌ కట్టడికి ఏడాది కాలంగా శ్రమిస్తున్న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) శుభవార్త తెలిపింది. కొవిడ్‌ చికిత్సలో ఉపయోగించే 2డీజీ ఔషధాన్ని సోమవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గర్భిణులపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం

కొవిడ్‌ అనుమానంతో ప్రసూతి ఆసుపత్రులు సత్వర వైద్యం అందించక పోవడంతో గర్భిణుల ప్రాణాలకు ముప్పువస్తున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణులు పాటించాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలనే అంశాలపై ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కేటీఆర్​కు వెల్లువెత్తుతున్న వినతులు

రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి కుటుంబీకులు, సన్నిహితుల నుంచి మంత్రి కేటీఆర్‌కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లతో పాటు చికిత్స కోసం పెద్దసంఖ్యలో అభ్యర్థనలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొవాగ్జిన్‌ టీకా రెండో డోసు నిలిపివేత

టీకా కొరత కారణంగా సోమవారం నుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు వాయిదా వేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటన చేసింది. 45 ఏళ్లు పైబడిన వారికి తాత్కాలికంగా వ్యాక్సిన్‌ ప్రక్రియ నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రాణవాయువు కోసం ఇబ్బందులు

రాష్ట్రంలో రోజురోజుకు ఆక్సిజన్‌ అవసరం పెరుగుతోందని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. కరోనా మొదటిదశలో ప్రాణవాయువు వినియోగం సాధారణ స్థాయిలోనే ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మోదీ పర్యటనలో హింసకు కుట్ర

జమాత్​ ఈ ఇస్లామి గ్రూప్ సీనియర్​ నేత షాజహాన్​ చౌధరిని బంగ్లాదేశ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. గత మార్చిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్​ పర్యటన సందర్భంగా చిట్టగాంగ్​లో అల్లర్లకు ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యలంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆకలి కోరల్లో అభాగ్యులు

రాష్ట్రాల్లో అమలవుతున్న కఠిన ఆంక్షలతో మునపటికన్నా తీవ్రమైన జీవనోపాధి సంక్షోభం ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపాధి కోల్పోవడం వల్ల కొవిడ్​ మరణాల కన్నా ఆకలి చావులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'తౌక్టే' మహోగ్రరూపం
    రానున్న 24గంటల్లో తౌక్టే తుపాన్​ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 18న గుజరాత్​లోని పోర్​బందర్​, మహూవా తీరాన్ని దాటనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • వాయిదా పడుతుందని ఊహించలేదు'

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నా ఒలింపిక్స్​లో పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు తెలిపింది ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు. ఈ సందర్భంగా ఈనాడుతో మాట్లాడిన ఆమె పలు విషయాలు పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బార్​లో వెయిటర్​గా పనిచేశా

తన కుటుంబం ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకుంది బాలీవుడ్​ డ్యాన్సర్, నటి​ నోరా ఫతేహి. 16వ ఏట నుంచే పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపిందీ భామ.. లాటరీ టికెట్లూ కూడా అమ్మినట్లు చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details