- నేడే 'ఆత్మనిర్భర్ భారత్' బడ్జెట్
కరోనాకు ముందు.. కరోనాకు తరువాత.. ప్రపంచ వ్యవహారాలను తిరగరాసుకోవాల్సిన సందర్భమిది. ఈ నేపథ్యంలోనే 2021-22 కేంద్ర బడ్జెట్‌ను కూడా చూడాల్సి ఉంది. నేడు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆత్మనిర్భర్ భారత్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వైద్యం, మౌలిక వసతులకు పెద్దపీట వేసే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నిర్మలమ్మ షెడ్యూల్ ఇదే..
2021-22 వార్షిక బడ్జెట్ ఇవాళ పార్లమెంటు ముందుకు రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్‌సభలో ఉదయం 11 గంటలకు పద్దును ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు.. రాష్ట్రపతిని కలవనున్నారు. మరి బడ్జెట్ వేళ.. ఆర్థిక మంత్రి షెడ్యూల్ తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బడ్జెట్ సూట్‌కేస్ చరిత్ర తెలుసా?
నేడు కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కొవిడ్ సంక్షోభంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. బడ్జెట్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది.. ఆర్థిక శాఖ మంత్రి చేతిలోని సూట్‌కేసు. ఎన్డీఏ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చారు ఆర్థిక మంత్రి. మరి ఈసారి ప్రతుల ముద్రణ లేనందునా.. పార్లమెంట్‌కు ఏవిధంగా వస్తారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వైద్య రంగానికే పెద్ద పీట!
కరోనా మహమ్మారి వల్ల చాలా రంగాలు కుదేలైతే.. వైద్య, ఆరోగ్య రంగంలో మాత్రం లోటుపాట్లు బయటపడ్డాయి. ఇలాంటి ప్రత్యేక పరస్థితుల నడుమ కేంద్రం సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మరి ఈసారి బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి కేటాయింపులు ఎలా ఉండొచ్చు? విశ్లేషకులు ఏమంటున్నారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బడ్జెట్లో తెలంగాణ లెక్క తేలేది నేడే..
కేంద్రం నుంచి ఐదేళ్లపాటు తెలంగాణకు అందే నిధులపై నేడు స్పష్టత రానుంది. ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు సహా వివిధ అంశాలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 15వ ఆర్థిక సంఘానికి నివేదించింది. సోమవారం పార్లమెంట్‌లో ఆర్థిక సంఘం నివేదికను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బడి గంట మోగింది