ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుచెట్టుకు గొడ్డలి పెట్టు.. అడవితల్లి గుండెలపై గొడ్డలి పోట్లు పడుతున్నాయి.. శేషాచలం ప్రాంతంలో ఎర్రచందనం చెట్ల నరికివేత నేపథ్యంలో ఇటీవల విడుదలైన పుష్ప సినిమా.. స్మగ్లర్ల తెగింపు ఏ రీతిలో ఉంటుందో చూపింది. రాష్ట్రంలోని అడవుల్లోనూ అలాంటి స్మగ్లర్లు కొందరు తిష్ఠ వేశారు. భార్య అదృశ్యం..మొదటి భర్త, పిల్లలను వదిలిపెట్టి రెండో పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ కనిపించకుండా పోయింది. ఆమె కోసం ఇద్దరు భర్తలు గాలించినా ఆచూకీ దొరకలేదు. ఎట్టకేలకు ఆమే పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఎక్కడికెళ్లావు అని మొదటి భర్త అడిగితే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అంటోంది.జేఎన్‌టీయూలో కొత్త సంస్కృతి.. జేఎన్టీయూహెచ్లో సిఫార్సులు, ఫైరవీలు జోరుగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రుల సిఫార్సు లేఖలతో కొందరు.. నేరుగా ఉన్నతాధికారులకు ఫోన్లు చేయిస్తూ మరికొందరు.. బిజీబిజీగా గడుపుతున్నట్లు సమాచారం.బౌద్ధ పర్యాటకానికి అవరోధం..నాగార్జునకొండకు బోటింగ్ సేవలు నిలిచిపోవడం.. బౌద్ధ పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏటా 15వేల మందికి పైగా పర్యాటకులు నాగార్జునసాగర్‌కు వచ్చి.. ఆ పక్కనే ఉన్న నాగార్జునకొండకు వెళ్లేవారు. కానీ ఆదాయం విషయంలో ఏపీ డిమాండ్లతో బోటింగ్ సేవలు నిలిచిపోయాయి. 'ప్రజలపై దృష్టి పెట్టండి' కొత్త సంవత్సరం వేళ ప్రధాని నరేంద్రమోదీకి నూతన సంకల్పాలను సూచించింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో ప్రజలందరి కోసం ప్రధాని పనిచేయాలని.. ఒకరిద్దరి కోసం కాదని పేర్కొంది. ఎన్నికలు, నేరగాళ్లు, సొంత పార్టీ.. ఇవి కాకుండా దేశం పట్ల నిర్వహించాల్సిన విధులే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు మిన్నగా ఉండాలని కోరింది.జీరో కరోనా మరణాలు.. తలనీలాలు సమర్పించి..ఓ గ్రామస్థులు సామూహికంగా తలనీలాలు సమర్పించి దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది ఆ ఊరిలో ఒక్క కొవిడ్ మరణం నమోదు కాకపోవడం వల్ల వినూత్నంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో జరిగింది.సులభంగా బ్రిటన్ వీసాలు!చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేయాలంటే భారత్‌కు మరింత స్నేహ హస్తం అందించాలని బ్రిటన్ భావిస్తోంది. ఈ క్రమంలో.. తమ దేశానికి వచ్చే భారతీయులకు మరింత చౌకగా, సులభంగా వీసాలు జారీ చేసే యోచనలో ఆ దేశ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 'ఫిబ్రవరిలోగా అందుబాటులోకి'రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఎస్-400 తొలి రెజిమెంట్‌ను ఫిబ్రవరిలోగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారత సైన్యం తెలిపింది. పంజాబ్‌లోని వైమానిక స్థావరంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది.కోహ్లీకి కలిసొస్తుందా?దక్షిణాఫ్రికా పర్యటన అంటే ఎప్పుడూ సవాలే. పేస్, బౌన్సీ పిచ్‌లపై సర్రున దూసుకొచ్చే బంతులను ఎదుర్కోవడం మన బ్యాట్స్‌మెన్‌కు పరీక్షే. కానీ ఈసారి పర్యటనలో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. సెంచూరియన్ టెస్టు గెలవడం ద్వారా సిరీస్ కలను నెరవేర్చుకునే దిశగా రెట్టించిన విశ్వాసంతో అడుగు ముందుకేసింది. విక్కీ కౌశల్ బైక్ రైడ్- కేసు నమోదు!బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ నటిస్తున్న 'లుకా చుప్పీ 2' సినిమాలోనకిలీ నంబర్ ప్లేట్‌తో బైక్‌ను వినియోగించినందుకు కేసు నమోదైంది. తన స్కూటీ నంబర్ ప్లేట్‌తో బైక్‌ను నడిపారని మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.