ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు 'ఆన్‌లైన్ బోధన కొనసాగించండి' TS High Court on Corona: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన కూడా కొనసాగించాలని ఆదేశించింది. ఈనెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలంది. మహా ధర్నా వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే.? Teachers Maha dharna on February 09th: జీవో 317 కు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ఈ నెల 9 న హైదరాబాద్ ధర్నాచౌక్‌లో మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. తొలుత ఈ నెల 5 న ధర్నా చేపట్టాల్సి ఉండగా.. ప్రధాని పర్యటన దృష్ట్యా 9వ తేదీకి వాయిదా వేసింది.' కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే' BJP Bheem Deeksha : పవిత్ర గ్రంథంగా భావించే రాజ్యాంగం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా భాజపా నిరసన దీక్ష చేపట్టింది. దిల్లీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మౌనదీక్ష చేపట్టగా.. రాష్ట్రంలో భాజపా భీం దీక్ష పేరిట నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాషాయ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.ముగిసిన టోనీ కస్టడి.. జైలుకు తరలింపు Drug Dealer Tony Custody Ends: నైజీరియన్ డ్రగ్ డీలర్ టోనీ కస్టడీ ముగిసింది. వైద్యపరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పంజాగుట్ట పోలీసులు.. అనంతరం చంచల్ గూడా జైలుకు తరలించారు. టోనీతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. ప్రధాన ఏజెంట్ ఇమ్రాన్ భార్య ఫిర్దోస్‌ను కూడా అరెస్టు చేశారు.అరగంట పాటు ఐస్ గడ్డల్లో.. Limca book of record feet: కాస్త చలి ఎక్కువైతేనే మనం వణికిపోతాం. చల్లటి వాతావరణంలో కాసేపు కూడా ఉండలేం. కానీ ఒకతను ఏకంగా ఐస్ గడ్డలు వేసుకుని మరీ అందులో ఏకంగా అరగంటపాటు కూర్చున్నారు. అలా ఎందుకు చేశాడనుకుంటున్నారా? అదేనండి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసమేనట. ఇంతకీ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే చూసేయండి.రాహుల్ వ్యాఖ్యలపై అమెరికా ఏమందంటే? Rahul gandhi news: ప్రధాని నరేంద్ర మోదీ అసమర్థ విధానాల వల్లే పాకిస్థాన్-చైనా కలిశాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. వీటిని తాము సమర్థించలేమని పేర్కొంది. అంతేగాక, పాకిస్థాన్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, ఇస్లామాబాద్‌తో తమకు కీలకమైన బంధం ఉందని చెప్పింది. చిన్నారిపై సొంత మామ అత్యాచారం! Jalore Rape: సొంత మామే నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి అరుపులు విని తల్లిదండ్రులు వెళ్లి చూడగా.. విషయం వెలుగులోకి వచ్చింది.విద్యుత్తు తీగలు పడి 26 మంది మృతి Power Cables Collapse Congo: వర్షం కారణంగా మార్కెట్లో హైఓల్టేజ్ విద్యుత్తు తీగలు తెగిపడి 26 మంది మృతిచెందారు. కాంగోలో జరిగిన ఈ ఘటనలోని మృతుల్లో ఎక్కువమంది మహిళలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. మహేశ్ అందుకే రాలేదా? Maheshbabu Trivikram hatrick movie: హీరో మహేశ్‌బాబు-దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న హ్యాట్రిక్ సినిమా షూటింగ్ మొదలైంది. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి మహేశ్ రాలేదు.వన్డే సిరీస్ వాయిదా? IND VS WI ODI Series Postpone: ఆటగాళ్లు కరోనా బారిన పడటం వల్ల వన్డే సిరీస్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జట్టులో మరిన్ని పాజిటివ్ కేసులు బయటపడితే సిరీస్‌ను వాయిదా వేయాలని బోర్డు యోచిస్తున్నట్లు తెలిసింది.