ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుమేడారానికి ప్రత్యేక బస్సులు..! RTC Special buses from Hyderabad to Medaram Jatara : మేడారం సమ్మక్క జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 680 ప్రత్యేక బస్సులను నడుపుతామని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ వెల్లడించారు. ఆర్టీసీ బస్సులన్నింటినీ శానిటైజేషన్ చేయడంతో పాటు.. ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. 'చలో విజయవాడ'పై ఉక్కుపాదం ఏపీలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడుగు బయటకు పెట్టనీయకుండా ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు.. రైళ్లు, బస్సుల్లో వెళ్లేవారిని అడ్డుకునేందుకు అణువణువునా తనిఖీలు... జాతీయ, ఇతర ప్రధాన రహదారుల పొడవునా చెక్‌పోస్టులు... వాహనాల్లో ప్రయాణించేవారిపై ప్రశ్నలు... పాఠశాలల వద్ద పోలీసుల మోహరింపు... పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడను అడ్డుకోడానికి ఏపీ ప్రభుత్వం ఇలా తీవ్రస్థాయి నిర్బంధాలు అమలుచేస్తోంది. 'ఆ తర్వాతే పరీక్షలు నిర్వహించండి' Telangana High Court On Kaloji University Appeal : రీవాల్యుయేషన్ చేశాకే మెడికల్ పీజీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని కాళోజీ యూనివర్సిటీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి గుర్తులు లేకుండా నిర్వహించిన డిజిటల్ వాల్యుయేషన్‌ను రద్దు చేసి రీవాల్యుయేషన్ చేసిన అనంతరమే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాళోజీ యూనివర్సిటీ దాఖలు చేసిన అప్పీలును కొట్టేసింది.'ఆ మొక్కు తీర్చుకుంటేనే కోడలిగా..' ఆదివాసీల ఆచారాలన్నీ ప్రకృతితో మమేకమై ఉంటాయి. చెట్టు, పుట్ట, చేను, అడవి చుట్టూ పరిభ్రమిస్తాయి. ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఆదివాసీలకు ముఖ్య పండుగ. ఇందులో వారి బతుకుచిత్రం ఆవిష్కృతమవుతుంది. భవిష్యత్తు ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది. సీఎం అభ్యర్థి ప్రకటన ఆరోజే! Punjab assembly polls: పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ఈనెల 6న రాహుల్ గాంధీ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత సీఎం చరణ్ జీత్ చన్నీ పేరు దాదాపుగా ఖరారైందని పేర్కొన్నాయి. వారి మరణాలు 9 రెట్లు ఎక్కువ! Galwan Clash: గల్వాన్ లోయలో భారత్‌తో జరిగిన ఘర్షణలో చైనా సైనికుల ప్రాణ నష్టం అధికారిక లెక్కల కంటే 9 రెట్లు ఎక్కువ ఉంటుందని ఆస్ట్రేలియా వార్తాపత్రిక తెలిపింది. గ్రీన్ టీతో కరోనాకు చెక్! Green Tea Benefits: గ్రీన్ టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది మెదడుకు హానికర పదార్థాలు చేరకుండా అడ్డుకునే వ్యవస్థను సైతం దాటుకొని వెళ్లి ఆందోళన తగ్గటానికి తోడ్పడుతుంది. ఇది తాగితే బరువు తగ్గుతారు అని చాలా పరిశోధనల్లో తేలింది. తాజా అధ్యాయనాల్లో తేలిందేమిటంటే.. గ్రీన్‌టీలో కరోనా వైరస్‌ను అడ్డుకునే శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వచ్చే వారమే సెబీకి ముసాయిదా! LIC IPO: భారత జీవిత బీమా సంస్థ-ఎల్ఐసీ మెగా పబ్లిక్ ఇష్యూ వచ్చే మార్చిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను వచ్చే వారం ప్రభుత్వం సేబీకి సమర్పించనుందని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం వెల్లడించింది. ఐఆర్డీఏఐ నుంచి అనుమతులతో ఈ ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది.అదే నా లక్ష్యం కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ తర్వాత అంతర్జాతీయ చెస్‌లో ఆ స్థాయిలో సత్తా చాటుతున్నాడు తెలుగుతేజం అర్జున్ ఇరిగేశి. తాజాగా ప్రతిష్ఠాత్మక టాటా స్టీల్ చెస్ ఛాలెంజర్‌లో ట్రోఫీ దక్కించుకున్న 18 ఏళ్ల అర్జున్ .. ఈ టైటిల్ నెగ్గిన నాలుగో భారత ఆటగాడిగా ఘనత సాధించాడు.వారి కాంబోలో మరో సినిమా? Harish Shankar-Alluarjun Movie: హీరో అల్లుఅర్జున్-హరీశ్ శంకర్ కాంబోలో మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. నేడు బన్నీతో కలిసి దిగిన ఓ ఫొటోను హరీశ్ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రానుందని ఆశిస్తున్నారు.