తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌ టెన్ న్యూస్ @ 11 AM - Latest Telangana news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news
తెలంగాణ ప్రధాన వార్తలు

By

Published : Jun 12, 2021, 11:00 AM IST

జులై 15న ఈ-వేలం

ధుల సమీకరణ కోసం ప్రభుత్వ భూములు అమ్మాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అమ్మకానికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారు... తాజాగా భూముల విక్రయానికి ప్రకటన జారీ చేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

పెట్రో బాదుడు

దేశంలో పెట్రో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ లీటరు పెట్రోల్​ ధరను 28 పైసలు, డీజిల్​ 25 పైసలు పెరిగింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

దేశంలో కరోనా విలయ తాండవం

దేశంలో కరోనా మరణాల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించటం లేదు. దేశవ్యాప్తంగా కొత్తగా 4,002 మంది కొవిడ్​ బారినపడి మరణించారు. మరో 84,332 కేసులు నమోదయ్యాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

చిన్నారి ప్రాణానికి ప్రపంచమే తోడు

మానవత్వానికి ఎల్లలు లేవని మరోసారి నిరూపితమైంది. ఓ పసిప్రాణాన్ని కాపాడటానికి ఏకంగా ప్రపంచమే కదిలింది. తామున్నామంటూ ఆదుకునేందుకు పలువురు ముందుకొచ్చారు. తలో చేయి వేసి చిన్నారి ప్రాణాలను నిలిపారు. వైద్యానికి అవసరమయ్యే భారీ మొత్తం రూ.16 కోట్లు క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా సమకూర్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

డ్రోన్ల ద్వారా ఔషధ సరఫరా

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు ఔషధాలు, వ్యాక్సిన్లను తరలించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ముందుకొచ్చింది. డ్రోన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానకి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ విధానం ద్వారా రానున్నరోజుల్లో ఆరోగ్య పరికరాలు, మందుల సరఫరాను విస్తృతంచేసే దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

కేసు పెట్టినందుకు దాడి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ మహిళపై కొంత మంది మహిళలు దాడి చేసిన దృశ్యాలు వైరల్​గా మారాయి. ఇంటి నిర్మాణం విషయంలో వచ్చిన విభేదాలతో మహిళపై ఈ దాడికి పాల్పడ్డారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

బ్లాక్​ దందా

బ్లాక్ ఫంగస్ ఔషధాల అక్రమ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాణాధార ఔషధాలను నల్లబజారులో విక్రయించకుండా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఆ దందా మాత్రం ఆగడం లేదు. పోలీసులు నిఘా పెట్టి అరెస్టులు చేస్తున్నా.. ఔషధ ముఠాలు అధిక ధరకు విక్రయాలు చేస్తూనే ఉన్నాయి. కొన్ని ఘటనల్లో ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది, మెడికల్ షాపుల నిర్వాహకుల హస్తం బయటపడుతోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ఊబకాయులను అద్దెకిస్తారట!

ఆ ప్రాంతంలో వ్యక్తులను అద్దెకివ్వడం కొత్తేమీ కాదు. కానీ, ఈసారి ట్రెండ్ మారింది. కొత్తగా ఊబకాయులను అద్దెకివ్వడం మొదలుపెట్టారు. ఓ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇంతకీ అది ఏ ప్రాంతం? వారు ఊబకాయులను అద్దెకు ఇవ్వడమేంటి? పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.


రెజ్లర్​ వినేశ్​కు స్వర్ణం

ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్​కు సిద్ధమవుతున్న భారత స్టార్​ రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ పోలెండ్​ ఓపెన్​లో సత్తాచాటింది. శుక్రవారం జరిగిన మహిళల 53 కేజీల విభాగం ఫైనల్​లో 8-0తో బెరెజా (ఉజ్బెకిస్థాన్)పై విజయం సాధించి స్వర్ణం అందుకుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

3 లక్షల జీతం వదిలొచ్చా

'30 వెడ్స్ 21' వెబ్ సిరీస్​తో గుర్తింపు తెచ్చుకున్న చైతన్యరావు.. తన వ్యక్తిగత, కెరీర్​కు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఈ సిరీస్​లో ఎలా అవకాశం వచ్చిందో వెల్లడించారు.పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details