ఈ ఏడాదిలో నేరాలు తగ్గాయ్..
రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అన్నిరకాల నేరాలు తగ్గాయని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. 2020 రాష్ట్ర వార్షిక నేర నివేదికను విడుదల చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రాజధానిలో సంచలనం సృష్టించిన కేసులివే..!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పోలీస్ విభాగం ఈ ఏడాది కాలంలో ప్రభావంతంగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. ఈ ఏడాది నేరాల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తగ్గగా.. ఆర్థిక, సైబర్ నేరాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భాజపా బేజారు
'మారుస్తాం.. అన్నీ మారుస్తాం' అంటూ తమిళ ప్రాంతీయ పార్టీల గుండెల్లో తుపాను రేపిన సూపర్‌స్టార్ 'రాజకీయం' మొత్తానికి ఏ అలజడి లేకుండా విశ్రాంతి తీరం చేరింది. రాజకీయాల్లోకి రాకుండానే గుడ్‌బై చెప్తూ రజనీ చేసిన సంచలన ప్రకటన అటు అభిమానులతో పాటు భాజపాను తీవ్ర నిరాశకు గురిచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రైతుల సంఘాల నేతలతో కేంద్రం చర్చలు
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్‌తో రైతు సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
న్యూఇయర్ వేడుకలపై..
న్యూఇయర్ సంబరాలపై నిఘా ఉంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ప్రజలు గుమిగూడకుండా నివారించాలని పేర్కొంది. కరోనాను దృష్టిలో ఉంచుకొని సూపర్ స్ప్రెడర్గా మారే అవకాశం ఉన్న కార్యక్రమాలపై పర్యవేక్షణ పెంచాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.