ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు'పాలసీ విధానాలు క్షేత్రస్థాయిలో అమలైతేనే సార్థకత' PM Modi Hyd Tour: ఐఎస్‌బీ విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న ప్రధాని.. అనేక స్టార్టప్‌లు కూడా రూపొందించారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఐఎస్‌బీ హైదరాబాద్ మరో మైలురాయి అందుకుందని ఆయన తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని.. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని ఆవిష్కరించారు. 'తెలంగాణలో అడుగుపెట్టగానే అర్థమైంది'Modi in Hyderabad: తెలంగాణ గడ్డపై అడుగుపెట్టగానే ఇక్కడి గాలి కాషాయంవైపే వీస్తోందనే విషయం అర్థమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడి ప్రజల్లో మార్పు మొదలైందని తెలిపారు. తెలంగాణ గడ్డపై భాజపా జెండా ఎగరడం ఖాయమనిపిస్తోందని చెప్పారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో మోదీ ప్రసంగించారు.'రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెప్తా' దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' మోదీ క్షమాపణ చెప్పాలి'Revanth Letter to PM Modi : తెలంగాణ ఏర్పాటు గురించి ప్రధాని మోదీ అవమానించేలా మాట్లాడారని.. నేడు హైదరాబాద్‌కు వస్తోన్న ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపక్షణ చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా 9 అంశాలను ప్రస్తావిస్తూ బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో భాజపా, తెరాస విఫలమయ్యాయని అన్నారు. కొనసాగుతున్న పెట్టుబడుల వెల్లువ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్రంలో హ్యుండాయ్ సంస్థ 14 వందల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. తెలంగాణ ఏర్పాటు చేయనున్న మెుబిలిటీ క్లస్టర్‌లోనూ పెట్టుబడులు పెట్టడంతో పాటు వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు అంగీకరించింది. నేడే ఆఖరు Police Job Application : పోలీసు ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇవాళ రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 17వేల 291 ఉద్యోగాలకు పోలీసు శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే 13 లక్షల మంది వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.కాంగ్రెస్ నేతలపై సీబీఐ.. శివసైనికులపై ఈడీ.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేపట్టాయి. మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత పరాబ్ నివాసంపై ఈడీ దాడులు చేపట్టింది. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. మరోవైపు ఝార్ఖండ్ మాజీ మంత్రికి చెందిన నివాసం, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేపట్టింది. చైనీయులకు వీసా కేసులో కార్తీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది.సైన్యంలోకి తొలి మహిళా యుద్ధ పైలట్ ఆమెనేAbhilasha Barak: ఆమె పుట్టి పెరిగిందంతా మిలిటరీ వాతావరణమే! అన్నా ఆ దారిలోనే వెళ్లాక ఆమె మనసూ దేశవైపు మళ్లింది. విదేశీ ఉద్యోగాన్ని కాదని మిలిటరీలో చేరింది. పురుషులతో పోటీ పడుతూ 36 మంది ఆర్మీ పైలట్‌ల్లో ఒకరిగా.. దేశంలోనే మొదటి మహిళా యుద్ధపైలట్‌గా నిలిచింది.. కెప్టెన్ అభిలాషా బరాక్. ఆమె ప్రయాణమిది.తగ్గిన బంగారం ధరలు.. స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్ Gold Rate Today: బంగారం, వెండి ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల పసిడి రూ.52వేల 520 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.63 వేలకు చేరింది. మరోవైపు స్టాక్ మార్కెట్లు 3 వరుస సెషన్ల నష్టాల అనంతరం పుంజుకున్నాయి.భారత హాకీ జట్టు విధ్వంసం.. నాకౌట్‌కు అర్హతAsia Cup Hockey: ఆసియా కప్ నాకౌట్ దశకు భారత హాకీ జట్టు దూసుకెళ్లింది. గురువారం ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో 16-0 తేడాతో అద్భుత విజయం సాధించింది.