కొవిడ్ -19 వ్యాప్తిని ఎదుర్కొనేందుకు విద్యుత్ సంస్థలు పూర్తిగా సన్నద్ధమయ్యాయని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కార్యాలయాలు, రెండు డిస్కంల వద్ద కంట్రోల్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని అన్ని జోనల్, సర్కిల్ హెడ్‌లకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
మార్గదర్శకాలు ఖరారు
కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి పవర్ సెక్టార్ అనుసరించాల్సిన వివరణాత్మక సూచనలు, మార్గదర్శకాలను ఖరారు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిని నిరంతరం పర్యవేక్షించడానికి, కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలను అమలు చేయడానికి తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (టీఎస్ఎల్డీసీ).. స్టేట్ ఎలక్ట్రిసిటీ కంట్రోల్ సెంటర్ (ఎస్ఇసీసీ) గా పనిచేస్తుంది.