ఏపీలోని విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై తెలంగాణ అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి పాపయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యాలు వ్యాపారంగా కాకుండా రోగుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సామర్థ్యానికి మించి రోగులను చేర్చుకోవద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రమాద తీవ్రత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.
'రోగుల ప్రాణాలకు ఆస్పత్రులు ప్రాధాన్యత ఇవ్వాలి' - విజయవాడ అగ్నిప్రమాదం వార్తలు
హోటల్స్‌ను ఆస్పత్రులుగా మార్చేక్రమంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఎక్కువని తెలంగాణ అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి పాపయ్య అన్నారు. వైద్యాన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు.. వ్యాపారంగా కాకుండా రోగుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
'రోగుల ప్రాణాలకు ఆస్పత్రులు ప్రాధాన్యత ఇవ్వాలి'
తెలంగాణలో తమ పరిధిలో ఉన్న 75 ఆస్పత్రులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రతి వారం ఆయా ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. హోటల్స్‌ను ఆస్పత్రులుగా మార్చే క్రమంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే అగ్నిప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఎక్కువని తెలిపారు. హోటల్స్, ఆస్పత్రులకు భద్రత పరంగా ఎలాంటి నిబంధనలున్నాయి? యాజమాన్యాలు వాటిని ఎలా పాటించాలనే విషయాలపై ఈటీవీ భారత్ ప్రతినిధి సతీశ్‌తో ప్రత్యేక ముఖాముఖి..