- సింఘు సరిహద్దులో రైతు సంఘాల నేతల భేటీ
సాగు చట్టాలపై కేంద్రంతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవటం వల్ల ఈనెల 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఈ నేపథ్యంలో బంద్‌కు విపక్ష, భాజపా భాగస్వామ్యేతర ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా కాంగ్రెస్ కూడా భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భారత్‌లో టీకా వినియోగానికి తొలి దరఖాస్తు
తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతులివ్వాలని 'భారత ఔషధ నియంత్రణ జనరల్'కు దరఖాస్తు చేసింది ఫైజర్ ఇండియా. టీకాను దిగుమతి చేసుకుని విక్రయించడానికి, పంపిణీకి అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భారీ స్థాయిలో టీకాల పంపిణీకి చైనా కసరత్తు
భారీ స్థాయిలో టీకాల పంపిణీకి చైనా కసరత్తులు చేస్తోంది. ప్రయోగాత్మక దశలో ఉన్న దేశీయ వ్యాక్సిన్ల కోసం అనేక రాష్ట్రాలు భారీ మొత్తంలో ఆర్డర్లు ఇచ్చాయి. చైనాలో ఐదు వ్యాక్సిన్లు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే వీటి ప్రభావం, భారీ జనాభా ఉన్న దేశంలో టీకాల పంపిణీపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఏలూరులో అంతుచిక్కని రోగం..
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పరిస్థితులు అంతు చిక్కడం లేదు. శనివారం ఉన్నట్టుండి 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఉదయం నుంచి 46 మంది బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా.. మరో 60 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రాజ్యాంగ నిర్మాతకు భాజపా నేతల నివాళులు
అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఎన్నికల తతంగం.. గంటకో నిర్ణయం.. రోజుకో విధానం.!