తెలంగాణ

telangana

ETV Bharat / city

Minister KTR on Hyderabad Floods: 'వచ్చే వానాకాలంలో నగర ప్రజలకు ఇబ్బంది ఉండదు'

Minister KTR on Hyderabad Floods : హైదరాబాద్​లో నాలాల సమస్యకు తెలంగాణ సర్కార్​ శాశ్వత పరిష్కారం చూపనుంది. హుస్సేన్​సాగర్​ వరదనీటి నాలాకు రక్షణ గోడ నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గతేడాది వర్షాలకు నాలా పరిసరాల్లో చాలా ప్రాంతాలు జలమయమవగా.. రక్షణ గోడ నిర్మిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు రక్షణ గోడ నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ నిర్వహించారు.

Minister KTR
Minister KTR

By

Published : Dec 30, 2021, 11:47 AM IST

Minister KTR on Hyderabad Floods: భాగ్యనగరంలో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నాలాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మొదటి దశలో రూ.859 కోట్లతో నాలాల అభివృద్ధి చేపడుతున్నట్లు వీటితో పాటు నాలాల విస్తరణ పనులు చేస్తామని చెప్పారు.

హామీ అమలు..

Minister KTR on Hussain Sagar Protective Wall: హైదరాబాద్​ హుస్సేన్‌సాగర్‌ వరదనీటి నాలాకు రక్షణ గోడ నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్​లో భాగంగా ఫీవర్ ఆస్పత్రి వద్ద రక్షణ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హుస్సేన్ సాగర్ వరదనీటి నాలా.. రక్షణ గోడ నిర్మాణానికి 68 కోట్ల4 లక్షల రూపాయలు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. గతేడాది వర్షాలకు నాలా పరిసరాల్లో చాలా కాలనీలు జలమయమవగా.. రక్షణ గోడ నిర్మిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా హుస్సేన్ సాగర్ వరద నాలాకు.. రక్షణ గోడ నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు.

వచ్చే జూన్​ నాటికి పనులు పూర్తి..

Hussain sagar canal's Protective Wall : ఎస్ఎన్‌డీపీ కింద అన్ని జోన్లలో నాలాల విస్తరణ చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీతో శివారు మున్సిపాలిటీల్లోనూ ఈ పనులు చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే జూన్ నాటికి రక్షణ గోడ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాలాలపై ఉంటున్న వారికి నష్టం లేకుండా పనులు చేస్తామని స్పష్టం చేశారు. నాలాల విస్తరణకు అందరూ సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు.

Hussain sagar canal's Protective Wall Foundation : 'గతేడాది వర్షాలకు హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్ నాలా పొంగింది. వరదలతో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు. 12 కి.మీ. నాలాకు రక్షణ గోడ నిర్మించాలని కోరారు. రక్షణ గోడ నిర్మాణంతో ఇళ్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎంను కోరాం. మా విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రక్షణ గోడకు నిధులు కేటాయించారు. నగరంలో నాలాలకు శాశ్వత పరిష్కారం చూపారు.'

- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details