తెలంగాణ

telangana

ETV Bharat / city

భారత్​ బయోటెక్ ఎండీ, జేఎండీలకు కేటీఆర్ అభినందనలు - భారత్​ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల

భారత్​ బయోటెక్ కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ అనుమతిపై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కోసం కృషి చేసిన బయోటెక్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

telangana minister ktr
భారత్​ బయోటెక్ ఎండీ, జేఎండీలకు కేటీఆర్ అభినందనలు

By

Published : Jan 3, 2021, 1:23 PM IST

భారత్ బయోటెక్ కొవాగ్జిన్​ టీకా వినియోగ అనుమతిపై రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్రలకు అభినందనలు తెలిపారు.

టీకాల రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తల కృషి వల్లే హైదరాబాద్​ ఖ్యాతి గడిస్తోందని తెలిపారు. టీకా కోసం కృషి చేసిన భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details