గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి జరగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
'పంచాయతీల ప్రగతిపై సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు'
ప్రకృతివనాలు, వైకుంఠ ధామాల పనులు త్వరగా పూర్తి చేయాలని... పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు... గ్రామీణ మంచి నీటి సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు మంచినీటి సరఫరాపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సీఎం కృత నిశ్చయంతో ఉన్నారన్న ఎర్రబెల్లి.. ఇటీవల సమావేశంలో శాఖ పనితీరును మెచ్చుకున్నారని పేర్కొన్నారు.
ఈ అభినందనలు అందరి కృషి వల్లే వచ్చాయని... అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు.
- ఇదీ చూడండి :సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆర్మీ దినోత్సవం