- ఉల్లి నిల్వలపై ఉత్తర్వులు
ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు సవరించిన నిబంధనలతో పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సిరిసిల్లలో కేటీఆర్
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రితోపాటు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నేలకొండ అరుణ, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్రావు, మున్సిపల్ ఛైర్పర్సన్ కళ ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. దమ్ముంటే రాజీనామా చెయ్
ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై మాజీ మంత్రి, భాజపా నేత బాబుమోహన్ విమర్శలు గుప్పించారు. లంచాలు తీసుకునే ఎమ్మెల్యేకు తనను విమర్శించే హక్కు లేదని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. తెరాస దుష్ప్రచారం
స్పష్టత లేకుండానే వ్యవసాయ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కొత్త చట్టం ప్రకారం పంట ధరపై ముందే ఒప్పందం కుదుర్చుకోవచ్చని చెప్పారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మల్లారెడ్డిపై కేసు
మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. తన భూమి కబ్జాకు గురైందని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తమ భూమిని కబ్జా చేసి... తప్పుడు పత్రాలు సృష్టించారని బాధితురాలు శ్యామలాదేవి ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.