- సీఎం కేసీఆర్ వినూత్నంగా బర్త్‌డే విషెస్..
KCR Birthday: ఏపీలోని కడియం నర్సరీలో సీఎం కేసీఆర్‌కు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ రూపాన్ని మొక్కలు, పూలు, కూరగాయలు, నవధాన్యాలతో తీర్చిదిద్దారు. తెలంగాణలో హరితహారం పథకం ద్వారా కడియం నర్సరీలకు సీఎం కేసీఆర్ ఎంతో మేలు చేశారని రైతు శ్రీనివాస్ తెలిపారు.
- వెయ్యికోట్లతో ఎంఆర్ఎఫ్ ఇండియా విస్తరణ..
MRF India Expansion : ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ ఇండియా తెలంగాణలో మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని సంగారెడ్డిలో వెయ్యి కోట్ల పెట్టుబడితో మరో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
- ఫిబ్రవరి 17 ఇక నుంచి నిరుద్యోగ దినం..
February 17th Unemployment Day: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం వల్ల వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. లక్షలాది ఖాళీలున్నాయన్న ఆయన... సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- మేడారంలో ప్రత్యేక ఆకర్షణగా మ్యూజియం..
Medaram Jathara 2022: మేడారం జాతరకు వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్న భక్తులకు ఆదివాసీ, గిరిజన మ్యూజియం స్వాగతం పలుకుతోంది. పిల్లలు, పెద్దలను ఆకర్షిస్తూ.. ఆనాటి గిరిజన, ఆదివాసీల బతుకు చిత్రాన్ని పరిచయం చేస్తోంది. ఈ మ్యూజియాన్ని సందర్శించేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు.
- 20లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు..
Oil Palm Expansion : రాష్ట్రంలో ఆయిల్‌పాం పంట సాగుపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. పంట, సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదతక పెంపు లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ ఆయిల్‌ఫాం, ముడి నూనెల మిషన్ కింద సమగ్ర విధానంలో రైతుల్లో ఆయిల్‌పాం సాగు చేయించేందుకు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటోంది.
- వాటర్ క్యాన్‌లో చిరుత పిల్ల తల..