'విద్యావంతులు వ్యవసాయంపై దృష్టి పెట్టాలి'
సూర్యాపేట జిల్లాలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పర్యటించారు. కేసారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. ఉన్నత విద్యావంతులు వ్యవసాయంపై దృష్టి పెట్టాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు లేని తెలంగాణగా మార్చింది కేసీఆరేనని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని చెప్పి..
వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని భర్తతో చెప్పి రైల్వే స్టేషన్ బయటకు వెళ్లిన భార్య ఎంతసేపైనా లోపలికి రాలేదు. ఏమైందా అని ఆరా తీసిన భర్త.. అసలు విషయం తెలిసి కంగు తిన్నాడు. ఎవరో అజ్ఞాన వ్యక్తితో కలిసి బైక్‌పై వెళ్లిందని తెలుసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వీరజవాన్ అంత్యక్రియలు పూర్తి..
బీజాపార్ వద్ద మావోయిస్టుల దాడిలో మృతిచెందిన వీరజవాన్ మురళీకృష్ణ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. వేలాది మంది ప్రజలు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భారత్, రష్యా మైత్రిపై..
భారత పర్యటనలో భాగంగా.. విదేశాంగ మంత్రి జైశంకర్‌తో రష్యా విదేశాంగ మంత్రి సర్లే లెవ్రో భేటీ అయ్యారు. ఇరు దేశాల బంధంపై ఇరువురు చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రఫేల్ డీల్‌పై రాహుల్..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. రఫేల్ ఒప్పందంపై ఓ ఫ్రెంచ్ మీడియా సంస్థ వార్తలను ప్రస్తావిస్తూ మోదీ సర్కార్‌ను తప్పుబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.