విద్యాసంస్థలు బంద్..
రేపట్నుంచి విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకొందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దేశానికే ఆదర్శం..
రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్‌లో రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు వేదికలు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనాపై నూతన మార్గదర్శకాలు
మరోసారి ఉద్ధృతి పెంచిన కొవిడ్-19 కట్టడికి నూతన మార్గదర్శాకాలు జారీచేసింది కేంద్రం. తక్షణమే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు సహా టీకాల పంపిణీ వేగవంతం చేయాలని రాష్ట్రాలకు చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నక్సల్స్ ఘాతుకం..
ఛత్తీసగఢ్ నారాయణ్‌పుర్ జిల్లా కన్హర్గావ్లో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లా రిజర్వు గార్డు(డీఆర్జీ) జవాన్లు వెళ్తున్న బస్సును ఐఈడీతో పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'బంగాలీ ఆత్మగౌరవం' దీదీని గెలిపించేనా?
"లోకల్ వర్సెస్ నాన్-లోకల్".... బంగాల్ రాజకీయం ప్రస్తుతం ఇదే అంశం చుట్టూ తిరుగుతోంది. మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొనేందుకు బంగాలీ ఆత్మగౌరవాన్ని అస్త్రంగా మలుచుకుంటోంది అధికార తృణమూల్ కాంగ్రెస్. ఇంతకీ ఈ వ్యూహం ఫలిస్తుందా? తిప్పికొట్టేందుకు భాజపా ఏం చేస్తోంది? శాసనసభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.